మహేష్ బాబు సక్సెస్ లో కీలకమైన పాత్ర ఎవరిదో తెలుసా ?
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో చూస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు శైలి పూర్తిభిన్నం గా ఉంటుంది. బాలనటుడిగా సంచలనం నమోదుచేసుకుని, పెద్దయ్యాక ప్రిన్స్ స్టార్ నుంచి సూపర్ స్టార్ వరకూ ఎదిగి తనదైన పంధాలో దూసుకెళ్తున్నాడు. పుట్టింది పెరిగింది తమిళనాడు కావడం వలన తెలుగుతో పాటు తమిళం కూడా బాగా వచ్చు. చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉండడం వలన సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ అక్కడే ఉండేవారు. దీంతో మహేష్ బాల్యం చెన్నైలో గడిచింది.
సూపర్ స్టార్ కృష్ణ ,ఇందిరాదేవి దంపతులకు 1974ఆగస్టు 9న జన్మించిన మహేష్ బాబు పదవతరగతి వరకూ చెన్నైలోనే చదివాడు. లయోలా కాలేజీలో ఇంటర్,డిగ్రీ పూర్తిచేసాడు. తమిళ స్టార్స్ సూర్య,కార్తీ కూడా మహేష్ స్కూల్ మేట్స్ . అందుకే వీలు చిక్కినపుడు చెన్నై వెళ్లి ఫ్రెండ్స్ తో కల్సి వస్తుంటాడు. తమిళం బాగా రావడం వలన స్పైడర్ మూవీ తమిళ వెర్షన్ కి అందుకే తన డబ్బింగ్ తానే చెప్పుకున్నాడు. మహేష్ కి నిజానికి తెలుగు రాయడం రాదట.
1975లో రిలీజైన నీడ మూవీతో ఐదేళ్ల వయస్సులో తెరంగేట్రం చేసిన మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా 7సినిమాలు చేసాడు. చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన బాలచంద్రుడు మూవీ గ్రాండ్ హిట్ అయింది. అయితే సినిమాల వలన స్టడీస్ కి బ్రేక్ పడుతుందని భావించి సినిమాలనుంచి దూరం పెట్టి స్టడీస్ కి పంపించాడు కృష్ణ. రాజకుమారుడు మూవీతో మహేష్ 1999లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీతో హిట్ అందుకుని ఒక్కోమెట్టు ఎక్కుతూ సూపర్ స్టార్ స్థాయికి చేరాడు.

