Movies

బాలయ్య గురించి ఈ నమ్మలేని నిజాలు మీకు తెలుసా ? PART 1

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ సీనియర్లలో టాప్ హీరో నందమూరి బాలకృష్ణ. అలాగే తెలుగులో నటవారసుల్లో టాప్ హీరో అనిపించుకున్న తొలి హీరో కూడా. 1960 జూన్ 10న నందమూరి బసవ తారకం, నందమూరి తారక రామారావు ఎనిమిదో సంతానంగా ఆరవ కొడుకు (కూతుళ్లను మినహాయిస్తే) గా జన్మించిన బాలకృష్ణ పద్నాలుగేళ్ల వయసులో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాతమ్మ కల సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బాలయ్య బాల్యం అంతా హైదరాబాద్‌లోనే గడిచింది. కాకినాడకు చెందిన వసుంధరతో 1982లో వివాహాం అయింది. వీరికి బ్రాహ్మణి, తేజిస్వి, ఇద్దరు కూతుళ్లతో పాటు కుమారుడు మోక్షజ్ఞ ఉన్నాడు. బ్రాహ్మణిని చంద్రబాబు తనయుడు లోకేష్ కిచ్చి వివాహం చేయగా, రెండో కూతురిని విశాఖకు చెందిన భరత్ కు ఇచ్చి చేసాడు. తండ్రి లాగే బాలకృష్ణ ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ యాడ్‌లో నటించలేదు. సోషల్ మీడియా కు సంబంధించి ఫేస్‌బుక్‌ అకౌంట్ ఉంది.

తండ్రి ఎన్టీఆర్ అభీష్టం మేరకు నిజాం కాలేజీలో బీఏ డిగ్రీ పూర్తి చేసిన బాలయ్య తొలినాళ్లతో తండ్రి చిత్రాల్లో సహాయ నటుడిగా బాలయ్య నటించాడు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ‘తాతమ్మ కల’,దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీమద్విరాట పర్వం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం వంటి సినిమాల్లో నటించారు. అయితే హీరో అయిన తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వంలో శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాల్లో బాలయ్య నటించాడు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో ఎన్టీఆర్ విశ్వామిత్రుడిగా, రావణుడిగా రెండు పాత్రల్లో నటిస్తే.. బాలకృష్ణ.. హరిశ్చంద్రుడు, దుష్యంతుడిగా ద్విపాత్రాభినయం చేసాడు. మొత్తం మీద తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి 12 చిత్రాల్లో చేసాడు. ఇందులో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలయ్య నటించిన ఆరు సినిమాల్లో నటించాడు.

తాతమ్మ కల నుంచి మహారథి వరకు మొత్తంగా ఏడు సినిమాల్లో బాలకృష్ణ తన సొంత పేరుతో బాలయ్య నటించగా, … తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణతో పాటు శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు చిత్రాల్లో శ్రీకృష్ణుడిగా నటించాడు. తండ్రి ఎన్టీఆర్ యాక్ట్ చేసిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, శ్రీకృష్ణదేవరాయలు, దుష్యంతుడు, హరిశ్చంద్రుడు వంటి పౌరాణిక, ఛారిత్రక పాత్రలను పోషించాడు. శ్రీసత్యనారాయణ మహాత్యంలో భగవంతుడిగా, భక్తుడి రెండు పాత్రల్లో ఎన్టీఆర్ మెప్పించినట్టే.. పాండురంగడు సినిమాలో భగవంతుడుగా భక్తుడి పాత్రలో బాలయ్య నటించాడు.

ఇక సోలో హీరోగా ‘సాహసమే జీవితం’ అనే మొదటి చిత్రం లో బాలయ్య నటించాడు. ఈ చిత్రానికి భారతీ వాసు దర్శకత్వం వహించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 7చిత్రాల్లో బాలకృష్ణ హీరోగా నటించగా, అందులో ఆరు చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ముఖ్యంగా హీరోగా దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్యధికంగా 13 చిత్రాల్లో నటిస్తే, అందులో 9 చిత్రాలు హిట్టైయితే.. 4 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అక్కినేని నాగేశ్వరరావుతో కల్సి ‘భార్యభర్తల అనుబంధం, ‘గాండీవం’, శ్రీరామరాజ్యం’ మూడు చిత్రాల్లో నటించారు. ‘భలే తమ్ముడు’, ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, తిరగబడ్డ తెలుగు బిడ్డ, రౌడీ ఇన్‌స్పెక్టర్, మాతో పెట్టుకోకు,సుల్తాన్, భలేవాడివి బాసు, సీమ సింహం, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా,అల్లరి పిడుగు, రూలర్ వంటి 12 మూవీస్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు.