నితిన్ సినిమాలో బాలీవుడ్ భామ నటిస్తుందా…ఈ భామకు రీ ఎంట్రీ…?
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అందాధూన్’ నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్లో టబు పోషించిన పాత్ర కోసం అనసూయ ఒకే చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అనసూయ కాదని చాలా మంది పేర్లు వినిపించాయి.
ఆ తర్వాత అదే పాత్ర మళ్లీ పోషించడానికి టబు ఒకే చెప్పిందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె పారితోషికం ఎక్కువ అడిగిందని నిర్మాతలు నో అని రమ్య కృష్ణ ని ఒకే చేసారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు శిల్పాశెట్టిని ఈ పాత్ర కోసం టాలీవుడ్ కి రప్పిస్తున్నట్టు తెలుస్తోంది.
