బన్నీ సినిమా కోసం ఎలా ప్లాన్ చేస్తున్నారో చూస్తే షాక్ అవ్వాలసిందే
‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఆ వెంటనే తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో ప్రారంభించాడు. ‘పుష్ప’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కి ముందు మొదలై కొన్ని రోజుల పాటు జరిగింది. అయితే,కరోనా రావటంతో లాక్ డౌన్ విధించడంతో షూటింగుకి బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం షూటింగులకు అనుమతి ఇవ్వడంతో పుష్ప సినిమా షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే,’పుష్ప’ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ కథతో రూపొందుతున్నందున షూటింగ్ ఎక్కువ భాగం అటవీ నేపథ్యంలో నిర్వహించాలి. ప్రస్తుతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలతో కూడిన షూటింగులకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో అవుట్ డోర్ లో చేయడం కుదరదని, ముందుగా ఇండోర్ సన్నివేశాల చిత్రీకరణను పూర్తీ చేయాలనీ,అలాగే పాటల చిత్రీకరణకు హైదరాబాద్ లోనే భారీ సెట్ వెయ్యాలని నిర్ణయం తీసుకున్నారట. కాబట్టి ముందుగా కొన్నాళ్ల పాటు సెట్స్ లో షూటింగ్ చేస్తారట. ఇక ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.
