Movies

నాగార్జునను స్టార్ హీరో గా చేసిన శివమణి సినిమా గురించి నమ్మలేని నిజాలు

2003 లో పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన శివమణి సినిమా నాగార్జున కెరీర్ కి బూస్ట్ ఇచ్చింది. నాగార్జునకు మాస్ ఇమేజ్ ని తీసుకువచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఇందులో అక్కినేని నాగార్జున, అసిన్, రక్షిత ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ వైష్ణో అకాడమీ పతాకంపై నిర్మించాడు. చక్రి సంగీత దర్శకత్వం వహించాడు.

శివమణి వైజాగ్ పూర్ణా మార్కెట్ సి. ఐ. చాలా నిజాయితీ గల అధికారి. ప్రజలందరికీ తన ఫోను నెంబరు ఇచ్చి ఏ సమస్య ఉన్నా అతనికి ఫోన్ చేయమని చెబుతాడు. వసంత అనే అమ్మాయి సరదాగా అతనికి ఫోన్ చేస్తుంది. నెమ్మదిగా వసంత అతని ప్రేమలో పడుతుంది. ఈ సినిమాలో ఆయన చెప్పే ఒక ఫోన్ నెంబర్ కోసం చాలా మంది అప్పట్లో పోటీ పడ్డారు. ఆ విధంగా ఈ సినిమాలో ఆ నెంబర్ హిట్ అయింది అనే చెప్పాలి. ఒకరకంగా ఈ సినిమా ఫోన్ నెంబర్ తోనే బాగా హిట్ అయింది.