సర్కారు వారి పాట సినిమా వాయిదా…కారణం ఏమిటో చూడండి
సరిలేరు నీకెవ్వరు తో సంక్రాంతికి హిట్ కొట్టిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ను ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. గీతగోవిందం డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తుండటంతో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. పైగా ఆర్థిక నేరాల బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా వస్తుండగా ఇందులో మహేష్ ఓ అదిరిపోయే లుక్‌లో కనిపిస్తాడు.
ప్రస్తుతం లాక్‌డౌన్ నడుస్తున్న కారణంగా సడలింపు తరువాత ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే చిత్ర యూనిట్ ఆశలు ఇప్పట్లో తీరతాయా అనే సందేహం ఏర్పడుతోంది. కరోనా వైరస్ పరిస్థితుల నుండి బయటపడ్డాకే ఈ సినిమా ప్రారంభించాలని మహేష్ కూడా అనుకున్నాడు. అందుకే టైటిల్,పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. అయితే ఇప్పుడు దేశంలో కరోనా కేసులు చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తోంది. అందుకే ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం లాక్‌డౌన్‌కు పెద్ద ఎత్తున సడలింపులు ఇవ్వడంతో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. కేసుల సంఖ్య పెద్ద ఎత్తున నమోదవుతుండటంతో చిత్రాన్ని మొదలుపెట్టేందుకు మహేష్ వెనకడుగు వేస్తున్నట్లు టాక్. ఆగస్టులో ఈ సినిమా పట్టాలెక్కిద్దామని అనుకున్నా, ప్రస్తుతం పరిస్థితుల కారణంగా ఏకంగా డిసెంబర్‌లోనే మహేష్ షూటింగ్‌కు వెళ్లాలని చూస్తున్నాడు. ఈలోగా మిగతా నటీనటులతో షూటింగ్ పనులు నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కానీ మరోపక్క ఈ మూవీ అసలు షూటింగ్ ఇప్పట్లో ఉంటుందో లేదో చెప్పడం కష్టమే అంటున్నారు.
