సైఫ్,కరీనాల అందమైన ప్యాలస్ ఖరీదు ఎంతో తెలుసా?
వారసత్వంగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కరీనా కపూర్ తన టాలెంట్ తో అగ్ర నటిగా మారింది. నటనలో ఈమె స్టైల్ వేరు. ఇప్పుడు సైతం కుర్ర హీరోయిన్స్ కి ధీటుగా నటిస్తూ తన చరిష్మా చాటుతోంది. తండ్రికి తగ్గ తనయగా పేరుతెచ్చుకున్న ఈమె 30ఏళ్ళ వయస్సులో తనకంటే చాలా పెద్దవాడైన సైఫ్ అలీఖాన్ ని పెళ్లాడింది.
పైగా సైఫ్ కి రెండో భార్యగా కరీనా వెళ్ళింది. పెళ్లయ్యాక వెడ్డింగ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లో దూసుకెళ్తోంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరిద్దరికీ వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు బోల్డంత సంపాదించేసారు. దాదాపు 10ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ఉద్యానవనాలు,స్విమ్మింగ్ పూల్,పక్కనే అందమైన రాజమందిరం ఒకటి. వీరి కుటుంబంలో జరిగే ఎన్నో వేడుకలకు వేదికగా ఉంటున్న దీని ఖరీదు ఇప్పుడు 800కోట్లు ఉంటుందని అంచనా.హరియానాలోని పాటౌడి ప్రాంతంలో గల సైఫ్ అలీఖాన్ రాజమందిరానికి ఇబ్రహీం కోటి అనే పేరుంది.
మొత్తం 150గదులు గల ఈ ప్యాలస్ లో ఏడు చొప్పున డ్రెస్సింగ్ రూమ్స్,బెడ్ రూమ్స్ ఉన్నాయి. పెద్ద డ్రాయింగ్ రూమ్,పెద్ద డైనింగ్ హాలు,సువిశాల గదులు ఉన్నాయి. నిజానికి పటౌడీ నవాబులు దీన్ని నిర్మించి ఇక్కడ నుంచే పాలన సాగించేవారట. ఈ సంస్థానానికి చెందిన 8వ నవాబు ఇఫ్తికార్ అలీఖాన్ నుంచి ఆయన కొడుకు మన్సూర్ అలీ ఖాన్ పటౌడికి ఈ ప్యాలెస్ సంక్రమించింది. ఆయన మరణంతో ఆయన కొడుకు సైఫ్ అలీఖాన్ ఆధీనంలోకి వచ్చింది.

