Movies

ఎం ఎస్ ధోని హీరో ఆత్మహత్య.!

భారత జట్టు మాజీ క్యాప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిన విషయమే. ఎన్నో ఏళ్ల కల ప్రపంచ కప్ తన సారధ్యంలో నెరవేరడంతో కెప్టెన్ కూల్ కు భారతీయులలో ఉన్నత స్థానం ఏర్పడింది.

అలాంటి ధోనీ జీవిత చరిత్రపై సినిమా అంటే ఎవరికైనా ఆసక్తి కలుగుతుంది. అంతటి స్ట్రాంగ్ రోల్ ను అద్భుతంగా చేసిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు ఒక్కసారిగా అమితమైన గుర్తింపు కూడా వచ్చింది.

అచ్చం ధోనీలానే కనిపించిన సుశాంత్ ఇప్పుడు తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని వచ్చిన వార్త ఒక్కసారిగా నెటిజన్స్ ను షాక్ కు గురి చేసింది. ఆరా తీయగా ఈ వార్త నిజమే అని తేలింది.