శ్రీకాంత్ డౌన్ ఫాల్ కి అసలు కారణాలివే…కోలుకోలేని దెబ్బ…?
టాలీవుడ్ లోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చి,విలన్ గా ,క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ హీరోగా మారి,స్టార్ హీరో స్థాయికి ఎదిగిన శ్రీకాంత్ అనగానే తాజ్ మహల్ , పెళ్ళిసందడి, ఖడ్గం లాంటి ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి. ఫ్యామిలీ హీరోగా ముద్రపడిన శ్రీకాంత్ 1991లో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. చిన్న చితకా పాత్రలతో నెట్టుకొస్తూ,విలన్ గా అవతారం ఎత్తి ,కొండపల్లి రాజా, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1994లో వన్ బై టు,దొంగ రాస్కెల్ వంటి మూవీస్ తో హీరోగా మారాడు. అయితే 1995లో వచ్చిన సురేష్ ప్రొడక్షన్స్ వారి తాజ్ మహల్ మూవీ హీరోగా మంచి పేరుతెచ్చింది. 1996లో పెళ్ళిసందడి మూవీ శ్రీకాంత్ కెరీర్ ని మార్చేసింది. కె రాఘవేంద్రరావు తీసిన ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టింది.
పెళ్ళిసందడి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అభిమాన సంఘాలు కూడా శ్రీకాంత్ కి వచ్చేసాయి . దాంతో వన్ మోర్ మూవీ రిలీజ్ కి అప్పటి టాప్ హీరోస్ తో సమానంగా హైదరాబాద్ లాంటి చోట్ల ఫాన్స్ హంగామా చేసారు. వినోదం,తాళి,ఎగిరే పావురమా,ఆహ్వానం,మా నాన్నకు పెళ్లి,ఊయల,పండగ,గిల్లికజ్జాలు ,కన్యాదానం,ఆయన గారు,ఇలా రెండేళ్లలోనే శ్రీకాంత్ మూవీస్ దూసుకెళ్లాయి. సక్సెస్ ఫుల్ హీరోగా శ్రీకాంత్ మార్కెట్ పెరిగింది. చిన్న సినిమాలకు కేరాఫ్ ఎడ్రెస్ అయ్యాడు. మినీ మెగాస్టార్ గా కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. దాదాపు 20మంది ప్రొడ్యూసర్స్ శ్రీకాంత్ ఇంటిదగ్గర పడిగాపులు కాసారంటే శ్రీకాంత్ స్టార్ డమ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు.
తారక రాముడు,ఖడ్గం,ప్రేయసి రావే, మహాత్మా లాంటి సినిమాల్లో శ్రీకాంత్ నటన తారాస్థాయికి చేరి, ఆల్ రౌండర్ అయ్యాడు. ఏడాదికి 10సినిమాలు తక్కువ కాకుండా చేసి,తక్కువ సమయంలోనే వంద మూవీస్ చేసిన హీరోగా నిలిచాడు. అయితే 2003నుంచి సడన్ గా ఇతడి గ్రాఫ్ పడిపోయింది. యంగ్ హీరోలుగా వారసత్వం రావడంతో శ్రీకాంత్ కి దెబ్బతగిలింది. పవన్ కళ్యాణ్,మహేష్ బాబు ఎంట్రీ శ్రీకాంత్ కెరీర్ కి ఇబ్బందిగా మారింది. దీనికి తోడు 1998నుంచి వరుస సినిమాలకు కమిట్ అయిపోయి,కథ సరిగ్గా వినకుండానే అడ్వాన్స్ తీసుకోవడం వలన కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ హీరోగా కన్వర్ట్ అవ్వడం కూడా మైనస్ అయింది. నిధి,గమ్యం,లాంటి సినిమాలు కొంపముంచాయి. తనకు పోటీగా ఉన్న జగపతి బాబు,జెడి చక్రవర్తి,వడ్డే నవీన్,వాళ్ళతో మల్టీస్టారర్ మూవీస్ చేయడం వలన మంచి కేరీర్ గల శ్రీకాంత్ ఇమేజ్ పడిపోయింది. దీంతో సెకండ్ హీరోగా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోవాల్సి వచ్చింది.

