Movies

రామ్ చరణ్, ఉపాసన ప్రేమ వెనుక ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో తెలుసా?

అటు బాలీవుడ్ లో గానీ, ఇటు టాలీవుడ్ లో గానీ, మరో భాషలో గానీ అందమైన ప్రేమకు గుర్తుగా జంటగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ రొమాంటిక్ కపుల్స్‌లో రామ్ చరణ్, ఉపాసన అని చెప్పాలి. దేశంలోనే ప్రఖ్యామైన రెండు కుటుంబాల నుంచి వచ్చిన ఈ ఇద్దరూ ఒకర్నొకరు ఐదేళ్ల పాటు ప్రేమించుకుని ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికి వీళ్ల బంధం మొదలై 8 ఏళ్లు గడిచిపోయింది. 2011 డిసెంబర్ 11న చరణ్‌, ఉపాసనల నిశ్చితార్ధం వైభవంగా జరిగింది. ఆ తర్వాత ఆరు నెలలకు 2012 జూన్ 14న అంగరంగ వైభవంగా చరణ్ పెళ్లి జరిగింది. ఈ 8 ఏళ్లలో ఉపాసన రామ్ చరణ్ జోడీ ఒక్కటంటే ఒక్క గాసిప్ కూడా లేకుండా ఐడియల్ కపుల్ అనిపించుకున్నారు.

అప్పట్లో దేశమంతా మాట్లాడుకునేంత ఘనంగా ఇరు కుటుంబ సభ్యులు చెర్రీ ,ఉపాసనల పెళ్లి జరిపించారు. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి మనవరాలే ఉపాసన. అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది ఉపాసన. కేవలం మెగా కోడలిగానే కాకుండా మానవతా వాదిగా కూడా ఉపాసనకు చాలా మంచి పేరుతెచ్చుకుంది. పేదలకు సాయం చేయడం.. ఉచిత మందుల పంపిణి లాంటి వాటిలో ఆమె అగ్ర భాగాన ఉంటుంది. రామ్ చరణ్, ఉపాసన పరిచయం ఒక స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగింది.

ఆ తర్వాత కలిసిన ప్రతి సందర్భంలో కూడా ఇద్దరూ ఒకర్నొకరు తెలుసుకున్నారు. వాళ్ల మధ్య మొదట్లో గొడవలు కూడా జరిగాయి.. కానీ అవి సిల్లీ గొడవలు మాత్రమే. వాటి వల్లే తమ మధ్య ఇంకా ప్రేమ పెరిగిందని ఉపాసన చెప్పేమాట. ఐదేళ్ల పాటు ప్రేమ ఊసులు చెప్పుకున్నారు. పెళ్లాడాలనుకుంటున్న విషయాన్ని ఇద్దరూ తమ ఇళ్లల్లో చెప్పేసి వాళ్లను ఒప్పించి మరీ ఒకటయ్యారు. నిజానికి చెర్రీ 2011లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన ప్రేమ విషయం పై తొలిసారి పెదవి విప్పాడు. అయితే ప్రేమకథ అని మాత్రం చెప్పకుండా అమ్మాయిని చూసారని మాత్రమే చెప్పాడు. పైగా క్లోజ్ ఫ్రెండ్‌ను పెళ్లాడబోతున్నానని చెప్పాడు.