చావు బతుకులో ఉన్న గజాలని కాపాడిన ఆ హీరో ఎవరో తెలుసా?
తెలుగు తమిళ మలయాళం సినిమాలను చేసిన గజాల 2001 సంవత్సరంలో సినీ పరిశ్రమకు వచ్చి అతి తక్కువ సమయంలో సినీ పరిశ్రమకు దూరం అయింది. టాలీవుడ్ హీరో తనను మోసం చేశాడంటూ దాదాపుగా చావు చివరి వరకు వెళ్లి వచ్చింది. ఆ సమయంలో యాక్షన్ హీరో అర్జున్ సహాయం చేయకుండా ఉంటే ఆమె పరిస్థితి ఎలా ఉండేదో చెప్పటం కష్టమే. ఈ సంఘటన జరిగాక ఆమె ఎప్పుడు హైదరాబాద్ లో కన్పించలేదు. టాలీవుడ్ నాలో ఉన్న ప్రేమ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో జోడి కట్టి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఆ సినిమాతో గజాల స్టార్ డం అందుకుంది. దాంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తరువాత ఉదయ్ కిరణ్ తో కలుసుకోవాలని సినిమాలో నటించింది.
ఆమె మే 19 1985లో జన్మించింది. గజాల కుటుంబం మొత్తం కువైట్ లో స్థిరపడింది. గజాలకు సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఆమె మాత్రం భారతదేశంలో ఉండి సినిమాలు చేస్తూ ఉండేది. ఆ సమయంలో టాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమ విఫలం అవవటంతో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దాని నుంచి బయటపడి హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళిపోయింది. ముంబై లో హిందీ టీవీ నటుడు ఫైజల్ రజా ఖాన్ పరిచయం ఇద్దరు కలిసి కొన్ని సీరియల్స్ లో నటించటం చేసారు. ఆ తరవాత గజాల 2016 ఫిబ్రవరి 24 న హిందీ టీవీ నటుడు ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం భర్త డైరెక్షన్ లో సీరియల్స్ లో నటించాలని అనుకుంటుంది.

