Movies

సుశాంత్ ఆస్థి ఎన్ని కోట్లు ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

పెద్ద సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంటున్న సుశాంత్ అకస్మాత్తుగా సూసైడ్ చేసుకోవడం బాలీవుడ్ నే కాదు ఇండియన్ ఇండస్ట్రీని కుదిపేసింది. రోజుకో వార్త వైరల్ అవుతుండగా, తాజాగా అతడి ఆస్తుల విషయంపై చర్చ నడుస్తోంది. సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లల్లో ముందుగా ప్రస్తావనకు వచ్చేది ఆస్తుల వ్యవహారమే.

ఎన్నో హిట్ సినిమాల్లో చేసిన సుశాంత్ ఒక్కో సినిమాకు 6నుంచి 7కోట్లు అందుకున్నాడని టాక్. ఖరీదైన కార్లు,బైక్ లు వాడతాడు కనుక 60లక్షల విలువ చేసే ఒక కారు, కోటి రూపాయలకు పైగా విలువ గల మరో కారు ఉన్నాయి. 26లక్షల విలువ చేసే ఓ బైక్ ఉంది.

శాస్త్ర విజ్ఞానంపై, అంతరిక్షం అంటే చాలా మక్కువ ఎక్కువ. అందుకే ఖరీదైన టెలీస్కోప్స్ కూడా కొనేవాడు. వీటి ఖరీదు లక్షల్లో ఉంటుంది. చందమామ అంటే చాలా ఇష్టం. అందుకే చంద్రమండలంపై స్థలం అమ్మితే కొనుక్కోవాలని కూడా భావించేవాడట. ఇక సుశాంత్ ఆస్తి విలువ 59కోట్లుగా లెక్కేస్తున్నారు.