నాగబాబు జబర్దస్త్ నుంచి ఎందుకు తప్పుకున్నాడంటే…
ప్రారంభం నుంచీ కూడా ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షోకి ఉన్నంత క్రేజ్ మరే కామెడీ షోకు కూడా లేదు. బుల్లితెరపై దీనికి పోటీగా కొన్ని షోస్ పెట్టినా కూడా జబర్దస్త్ ముందు బలాదూర్ అయ్యాయి. కొన్ని షోస్ అయితే వెంటనే తీసేసారు. కానీ జబర్దస్త్ ఏడేళ్లుగా టాప్ రేటింగ్ తో నడుస్తూనే ఉంది. మొదటి నుంచి నాగబాబు, రోజా జడ్జీలుగా ఉంటూ ఈ షోకి వన్నె తెచ్చారు. ఇక ఈ షో నుంచి ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పుడు వాళ్లు మంచి స్థాయిలో ఉన్నారు. కొందరు జబర్దస్త్ వదిలేసి బయటికి వెళ్లిపోయి సినిమాలు కూడా చేసుకుంటున్నారు.
ఇక ఇందులో యాంకర్స్‌గా ఉన్న అనసూయ, రష్మి గౌతమ్ కూడా ఈ షో నుంచే పాపులర్ అయ్యారు.అయితే నాగబాబు తో పాటు మరికొందరు లాంటి వాళ్లు వెళ్లిపోయినా కూడా జబర్దస్త్ కామెడీ షో మరింత జబర్దస్త్ గా సాగుతోంది. అంతకు ముందు వాళ్లు కొన్ని షోలు చేసినా కూడా గుర్తింపు రాలేదు. కానీ జబర్దస్త్ తర్వాతే స్టార్స్ అయ్యారు. ఇదిలా ఉంటే జబర్దస్త్ కామెడీ షోకు అంత హైప్ రావడంలో తన పాత్ర కూడా ఉందని అనసూయ చెబుతుంది. తాము ఉండటం వల్ల కూడా జబర్దస్త్‌కు క్రేజ్ వచ్చిందని.. గ్లామర్ కలిసిందని చెప్పింది. తాజాగా అభిమానులతో ఈ బ్యూటీ ముచ్చటిస్తూ నాగబాబు వెళ్లిపోవడంపై కూడా కొన్ని కామెంట్స్ చేసింది.
జబర్దస్త్ కామెడీ షో ఎవరున్నా లేకపోయినా కూడా నడుస్తుందని.. ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదని అనసూయ చెప్పింది. వెళ్లిపోయే వాళ్లను వద్దని చెప్పదు.. అక్కడున్న వాళ్లను వెళ్లిపొమ్మని మల్లెమాల ఎప్పటికీ చెప్పదని అనసూయ స్పష్టంగా చెప్పింది. మాకు మేం వదిలేసి వెళ్తే తప్ప జబర్దస్త్ నుంచి ఎవరూ బయటికి వెళ్లరని.. అలాగే నాగబాబు కూడా తన సొంత నిర్ణయం తీసుకున్నాడని చెప్పింది. అందులో ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయని, అంత మాత్రాన నాగబాబు జబర్దస్త్‌ను ఏదో పగతో వదిలేసి వెళ్లిపోయాడు అనుకోవడం తప్పని ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యానించింది. తన గురించి చెప్తూ మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ సినిమాల కారణంగా వదిలేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. చాలా రోజుల తర్వాత మళ్లీ షూట్‌కు వచ్చానని చెప్పింది.
