మెగా బ్రదర్స్ ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారా..ఆ ఎదురు చూపు ఫలిస్తుందా?
రియల్ లైఫ్ లో పోషించే పాత్రలను రీల్ లైఫ్ లో చేయడం ఓ వింత అనుభూతి. నందమూరి హీరోల విషయానికొస్తే.. ఎన్టీఆర్, బాలకృష్ణ,హరికృష్ణ ‘తాతమ్మ కల’ సినిమాలో తండ్రి కొడుకులుగా చేసి, నిజ జీవిత పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్, బాలయ్య ‘అక్బర్ సలీం అనార్కలి’ తండ్రి కొడుకులుగా నిజ జీవిత పాత్రలను వెండితెరపై పోషించారు. ఆ తర్వాత వేరే కొన్ని సినిమాల్లో తండ్రి రామారావుతో బాలకృష్ణ నటించినా.. నిజ జీవిత పాత్రలైన తండ్రి కొడుకులుగా చేయలేదు. అలాగే అక్కినేని ఫ్యామిలీలో ఏఎన్నార్, నాగార్జున కూడా ‘కలెక్టర్ గారి అబ్బాయి’, ‘అగ్ని పుత్రుడు’, ‘ఇద్దరూ.. ఇద్దరే’ సినిమాల్లో వాళ్లు నిజ జీవిత పాత్రలైన తండ్రి కొడుకులుగా తెరపై కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక నాగేశ్వరరావు, నాగార్జున.. ‘రావుగారిల్లు’, శ్రీరామదాసు’, ‘మనం’ చిత్రాల్లో నటించిన నిజ జీవిత పాత్రలను తెరపై ఆవిష్కరించలేదు. మనంలో నాగార్జున కొడుకుగా ఏఎన్నార్, చైతూ కొడుకుగా నాగార్జున నటించారు.
ఇక సూపర్ స్టార్ కృష్ణకు చెందిన ఘట్టమనేని ఫ్యామిలీ తీసుకుంటే,.. కృష్ణ, మహేష్ బాబు, ‘శంఖారావం’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘రాజ కుమారుడు’ సినిమాల్లో తండ్రి కొడుకులుగా నిజ జీవిత పాత్రలనే పోపించి అభిమానులను కనువిందు చేసారు.ఇక అన్న రమేష్ బాబుతో మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించారు. ఇక కృష్ణ కూడా తన జీవిత భాగస్వామి విజయ నిర్మలతో ఎన్నో సినిమాల్లో జోడి కట్టారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రంలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న అందులో కూడా వీళ్లు నిజ జీవిత పాత్రల్లో కాదు. చిరంజీవి, నాగబాబు కొన్ని సినిమాల్లో కలిసి నటించినా.. నిజ జీవిత పాత్రలైన అన్నాదమ్ములుగా మాత్రం కాదు. చిరంజీవి, రామ్ చరణ్ కూడా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కలిసి నటించలేకపోయినా.. గెస్ట్‌లుగా మాత్రం ‘మగధీర’,‘బ్రూస్లీ’, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు తప్ప నిజంగా తండ్రీ కొడుకులుగా నటించలేదు.
అందుకే తమ అభిమాన హీరోలను సిల్వర్ స్క్రీన్ పై నిజ జీవిత పాత్రల్లో నటిస్తే చూడాలని మెగా ఫాన్స్ ఆశ. అలాగే నాగబాబు, నిహారిక తండ్రి కూతుళ్లుగా నటించారు.‘ప్రేమమ్’ చిత్రంలో నాగార్జున, నాగ చైతన్య తండ్రి కొడుకులుగా వాళ్ల నిజ జీవిత పాత్రలనే తెరపై చేసారు. అలాగే గతేడాది వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటించిన ‘వెంకీ మామ’ సినిమా చేసారు. ఈ చిత్రంలో వెంకటేష్, నాగచైతన్య వాళ్ల రియల్ లైఫ్‌లో లాగే మామ అల్లుళ్లుగా నటించడం విశేషం. ఈ రెండింటి మధ్య నాగ చైతన్య తన జీవిత భాగస్వామి సమంతతో కలిసి ‘మజిలీ’ సినిమా చేసాడు. నాగార్జున మాత్రం పెళ్లి తర్వాత అమలతో ఏ సినిమా జోడీ కట్టలేదు. కృష్ణంరాజు నిజజీవితంలో ప్రభాస్ కి పెద్దనాన్న. అయితే ‘బిల్లా’, ‘రెబల్’ చిత్రాల్లో వీరిద్దరూ నటించినా.. నిజ జీవిత పాత్రల్లో మాత్రం కాదు. ఇక ముందు ఏదైనా సినిమాల్లో పెదనాన్న, అబ్బాయి పాత్రల్లో చేస్తారేమో మరి.
