నిహారిక కాబోయే భర్త ఎవరు…ఏమి చేస్తాడో తెలుసా ?
ఇండస్ట్రీలో పెళ్లి కావాల్సిన వాళ్ళ గురించి రకరకాల గాసిప్స్ వస్తుంటాయి. ఇందులో ఎవరూ మినహాయింపు కాదు. మెగా డాటర్ నిహారిక విషయంలో కూడా పెళ్లి గురించి రకరకాల వార్తలొచ్చాయి. అయితే అవి నిజం కాదని తేలిపోయాయి. ఇక ఏదోరకంగా ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్న నిహారిక ఆ మధ్య హాట్ హాట్ ఫొటోస్‌తో మ్యాగ్జైన్ కవర్ పేజీలపై దర్శనమిచ్చి సెన్షేషన్ అయింది. నిహారిక కోలీవుడ్‌లో ఓ చిత్రంలో గ్లామర్ ప్రదర్శన చేయబోతోందంటూ కూడా వార్తలు వినవచ్చాయి. ఇప్పుడు పెళ్లి అంటూ మరోసారి మెగా డాటర్ వార్తల్లో కి వచ్చింది. ఎందుకంటే ఇటీవల నాగబాబు స్వయంగా కూడా సంబంధాలు చూస్తున్నా మంటూ నిహారిక పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చేసాడు.
త్వరలోనే మా అమ్మాయి, అబ్బాయికి వివాహం చేస్తానని కూడా నాగబాబు చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పినట్లుగానే త్వరలోనే మెగా ఇంట ముఖ్యంగా నిహారిక పెళ్లి బాజాలు మోగేలా కనబడుతున్నాయి. తన పెళ్లి గురించి నిహారిక కూడా హింట్స్ ఇచ్చేస్తుంది. తన ఫేస్ బుక్ పేజీలో ఒక కప్పుపై ‘మిస్ నీహ’ అని రాసి.. దానిలో ‘మిస్’ను కొట్టేసి కింద ‘మిసెస్’ అని రాసి క్వశ్చన్ మార్క్ పెట్టింది. దీంతో నిహారిక పెళ్లి విషయంలో ఫాన్స్ కూడా ఓ అంచనాకు వచ్చేసారు. తాజాగా ఆమె మరో ఫొటోని ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది.

ఈసారి ఆమె చేసిన పోస్ట్ ఈ రేంజ్ లో ఉందంటే, కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది. ఎందుకంటే ఈ ఫొటోలో నిహారిక తనకు కాబోయే వాడిని హగ్ చేసుకుని ఉంది. ఫేస్ కనిపించడం లేదు కానీ ఖచ్చితంగా అతను తనకు కాబోయే వాడే అని అర్థమవుతుంది. ఇక నిహారిక పెళ్లి గురించి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. నిహారిక చేసుకోబోయే కుర్రాడి పేరు చైతన్య అని, ఈ సంబంధాన్ని మెగా బ్రదర్స్ అందరూ మాట్లాడుకునే ఫైనలైజ్ చేశారని టాక్. గుంటూరు ఐజీ కుమారుడు అని అతను ఓ ఎమ్.ఎన్.సి. కంపెనీలో ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్నట్లు టాక్. అలాగే అతను పేరున్న ఓ కాలేజీలో మేనేజ్మెంట్ గ్యాడ్యుయేట్గా కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నిహారిక, చైతన్యల నిశ్చితార్థం ఆగస్ట్‌లో జరిపి, వివాహం ఫిబ్రవరి 2021లో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్.
