Movies

బిగ్ బాస్ 4 లో టాప్ కమెడియన్… ఎవరో చూడండి

విలక్షణమైన హావభావాలను పలికిస్తూ తెలంగాణ యాసతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన బిత్తిరిసత్తి ‌. వీ6లో జర్నలిజంతో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి ఆ తర్వాత ఇస్మార్ట్ న్యూస్‌తో టీవీ9లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే బిత్తిరి సత్తికి ఊహించని షాక్ తగిలింది. టీవీ9 నుంచి ఆయన్ని తొలగిస్తూ యాజమాన్యం మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసారు.

ఇది ఇలా ఉండగా బిత్తిరి సత్తి గురించి మరో వార్త హల్ చల్ చేస్తుంది. బిగ్ బాస్ 4 లోకి బిత్తిరి సత్తి ఎంట్రీ ఇస్తున్నాడట. బిగ్ బాస్ 3 లో కూడా ఎంట్రీ ఇస్తాడని వార్తలు వచ్చిన వెళ్ళలేదు. ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.