RRR షూటింగ్ మూడు నెలలు వాయిదా పడిందా…టైంకి అవుతుందో లేదో ?
RRR షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. మరల షూటింగ్ మొదలు పెట్టటానికి అడ్డంకులు వచ్చాయి. అలాగే హీరోలు రామ్ చరణ్,ఎన్టీఆర్ కూడా షూటింగ్ చేయటానికి సుముఖంగా లేరట. అంతేకాకుండా RRR కోసం పూణేలో సెట్ వేద్దామని అనుకున్నారు. ప్రస్తుత పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. దాంతో నల్గొండలో సెట్ వేయటానికి అనువుగా ఉన్న ప్రదేశం కోసం వెతుకులాట ప్రారంభం అయింది.
ఇవన్నీ ఒక కొలిక్కి రావాలంటే దాదాపుగా మూడు నెలల సమయం పడుతుంది. ఆ సమయానికి అలియా భట్ డేట్స్ కష్టం అవ్వవచ్చు. కరోనా కారణంగా RRR కి చాలా కష్టాలు వచ్చి పడ్డాయి. వీటిని దర్శక ధీరుడు ఎలా అధికమిస్తాడో చూడాలి.
