సినిమా విడుదల కాకుండానే మరో ఛాన్స్ కొట్టేసిన మెగా మేనల్లుడు
సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా ఉప్పెన సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అవుతున్నాడు. పరిస్థితులు అన్ని బాగుంటే ఈపాటికే అభిమానుల ముందుకి వచ్చేవాడు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. మొదటి సినిమా రిలీజ్ కాకముందే రెండో సినిమా ఆఫర్ రావటంతో వైష్ణవ్ తేజ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కూడా ఓ కొత్త దర్శకుడితో చేయనుండగా యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతుంది. ఈ సినిమా కథను అన్నదమ్ములు ఇద్దరు విన్నారట. వారికీ నచ్చిందట. ఇక చిరు చెప్పితే సినిమా పట్టాలెక్కినట్టే.
