Movies

ఆహా కోసం చరణ్,బన్నీ లను రంగంలోకి దించారా…దశ తిరుగుతుందా…?

ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో స్టార్స్ అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. థియేటర్ల మూతకారణంగా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాల్లో థియేటర్స్ లేని కారణంగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ని ఆశ్రయిస్తున్నారు. మరోపక్క సడలింపులు కొన్ని పరిమితులకు లోబడి ఇవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పాచ్ వర్కులు జరుగుతున్నాయి. కొన్ని సినిమాల షూటింగ్స్ జరుగుతున్నా భారీ సినిమాలు అప్పుడే స్టార్ట్ కావడంలేదు.

థియేటర్స్ లేకపోవడంతో అమెజాన్,నెట్ ఫ్లిక్స్,హాట్ స్టార్ వంటి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ఉండగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అండ్ కో బాచ్ ముందుచూపుతో పెట్టిన ఆహా ఓటిటి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కేవలం తెలుగు కంటెంట్ తోనే పూర్తిస్థాయిలో ఎత్తుకోలేదు. ఆహా కి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ అయినా సరే, లాభం దక్కకపోవడంతో మిల్కీ బ్యూటీ తమన్నాని కూడా దించి ఓ స్టార్ టాక్ షో ప్లాన్ చేస్తున్నట్లు వైరల్ అయింది. ఈ అమ్మడికి ఒక్కో ఎపిసోడ్ కి 8నుంచి 10లక్షలు ఇవ్వాలన్న ప్లాన్ చేస్తున్నారట.

ఎందుకంటే ఇప్పటిదాకా రానా,మంచు ,లక్ష్మి ఆలీ లాంటి వాళ్ళు చేసినా తమన్నా అయితే ఆ కిక్కే వేరు అని అంటున్నారు. అంతేకాకుండా చిన్న చిన్న స్టార్స్ కాకుండా బన్నీ, రామ్ చరణ్ వంటివాళ్లను రంగంలో దించే యోచనలో ఉన్నట్లు, ముఖ్యంగా వీళ్ళతో షోస్ ప్లాన్ చేయాలని యోచిస్తున్నట్లు టాక్. రేపో మాపో ఫస్ట్ సిరీస్ కూడా ప్లాన్ అవుతోందని అంటున్నారు. అదే జరిగితే ఆహా రేంజ్ పెరగడం ఖాయం. ఇద్దరూ కలిసి చేసే కన్నా,విడివిడిగా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారట. వీళ్ళు వస్తే నిజంగా ట్రెండ్ సెట్టర్ అవుతుందనడంలో సందేహంలేదు.