ఎవరు ఊహించని పని చేస్తున్న పవన్ కళ్యాణ్… తెలిస్తే ఆశ్చర్యపోతారు
జనసేన అధిపతిగా ప్రభుత్వ తీరుతెన్నులపై ఎప్పటప్పుడు స్పందిస్తున్న పవర్ స్టార్ పవన్ మరోపక్క సినిమాల్లో కూడా బిజీగానే ఉన్నాడు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ పడింది. లేకుంటే, లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకోవడం, మిగిలిన పార్ట్ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అనుకున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అజ్ఞాతవాసి తర్వాత భారీ గ్యాప్ నేపథ్యంలో వచ్చే ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవాలని పవన్ భావిస్తున్నాడు.ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా వకీల్ సాబ్‌కు చెందిన మరో 10 రోజుల షూటింగ్ వాయిదా పడడం, సడలింపులు ఇచ్చినా కరోనా కేసులు పెరిగిపోవడం నేపథ్యంలో ఇప్పట్లో షూటింగ్‌లలో పాల్గొనడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో పవన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పవన్ చాతుర్మాస్య దీక్షను బుధవారం చేపట్టాడు.ప్రజలు క్షేమంగా ఉండాలని, ప్రస్తుత పరిస్థితులు చక్కబడాలని ఆయన భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ కఠిన దీక్ష చేస్తున్నాడు.
ఇది మామూలు దీక్షలా కాదు. నాలుగు నెలల పాటు ఈ దీక్షలో పవన్ ఉంటాడని, అప్పటివరకు మరెలాంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోడ ని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఏదేమైనా పవన్ ప్రజల కష్టాలను చూసి ఇలాంటి కఠినమైన దీక్షను చేపట్టాడని జనసైనికులు సంబర పడుతున్నారు. ఇక ఈ దీక్షలో భాగంగా పవన్ చాలా కఠినమైన నియమాలు పాటించనున్నాడు. బ్రహ్మ చర్యం, ఒంటి పూట భోజనం, భూతల శయనం, నదీ స్నానం వంటి అనేక కఠిన నియమాలను పవన్ పాటించనున్నట్లు టాక్.
