Movies

సాహో తప్పులు మళ్ళీ రిపీట్ అవుతున్నాయా…అయితే కష్టమే

సాహో తర్వాత ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తాజా మూవీ అందునా ప్రభాస్‌ నటిస్తున్న 20వ చిత్రం ‘రాధేశ్యామ్‌’ అనే టైటిల్‌ని చిత్రబృందం ప్రకటించడంతో పాటు ఫస్ట్‌ లుక్‌ని శుక్రవారం విడుదల చేసింది. దీంతో ఫాన్స్ తో పాటు నెటిజన్స్ పోస్టులతో అదిరిపోతోంది. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమెద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాహో దెబ్బతిన్నాకా అలాంటి పరిస్థితి రాకూడదని అందరూ అనుకుంటున్నారు.

నిజానికి ఈ కొత్త సినిమా టైటిల్ ఎప్పుడో లీక్ అయినా సరే,.. ప్రభాస్, పూజాహెగ్డే ఎలా ఉంటారా అని అందరూ ఎదురుచూస్తూ వచ్చారు. అయితే బార్బిడాల్‌ డ్యాన్స్‌ పోజుతో రిలీజ్‌ చేసిన ఈ మొదటి లుక్‌ లవ్‌లీగా ఉందని ఫాన్స్ సంబరపడిపోతున్నారు ‌.ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్‌ రాయ్‌ కపూర్, జగపతిబాబు, జయరాం, సచిన్‌ ఖేడ్‌కర్, భీనా బెనర్జీ, మురళీ శర్మ, శాషా ఛత్రి, ప్రియదర్శి, రిద్దికుమార్, సత్యాన్‌ తదితరులు నటిస్తున్నారు.

బాలీవుడు కంపోజర్స్ ని కూడా ఈ సినిమా కోసం తెచ్చారు. అయితే దీనిపై కూడా క్లారిటీ రావాలని అంటున్నారు. వైవిధ్యమైన ప్రేమకథ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఇప్పటికే 70 శాతం టాకీ పార్ట్‌ని పూర్తి చేసుకుంది. ఈలోగా కరోనా లాక్ డౌన్ రావడంతో పోస్ట్ ఫోన్ అయింది. అయితే మిగతా షూటింగ్‌ పార్ట్‌ని కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ప్రారంభించాలనుకుంటున్నారు.