Movies

లూసీఫర్ చుట్టూ ఎన్నో చిక్కులు… సినిమా ఉన్నట్టా….లేనట్టా..!

రాజకీయాలనుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెంబర్ 150, సైరా మూవీస్ తో వియాలను నమోదు చేసుకుని ప్రస్తుతం ఆచార్య మూవీ కొరటాల శివతో కల్సి చేస్తున్నాడు. అయితే కరోనా మహమ్మారితో షూటింగ్ ఆగిపోయింది. లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉన్నప్పటికీ కరోనాపై చైతన్యం కల్పించే వీడియోలు చేసి తన సత్తా చాటాడు. షరతులతో షూటింగ్స్ కి అనుమతి ఇచ్చినా ఇంకా షూటింగ్స్ వైపు చూడడం లేదు. తాజాగా మాస్క్ పై అవగాహనా కల్పిస్తూ రెండు వీడియోలు ట్వీట్ కూడా చేసాడు.

ఇక తమిళంలో హిట్ అయిన లూసిఫర్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలనీ చిరంజీవి చాలా ఆసక్తిగా ఉన్నాడు. సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించనున్న ఈ సినిమా విషయంలో కొన్ని చిక్కులున్నాయి. ఎందుకంటే మలయాళంలో హీరోయిన్ ఉండదు. అలా యాజ్ టీజ్ గా తీస్తే, మెగా అభిమానులకు నచ్చదు. అలాగని హీరోయిన్ పెడదామంటే, తేడా కొడుతుందని తర్జనభర్జన పడుతున్నారు. ఇక మలయాళంలో మోహన్ లాల్ చేసిన ఈ మూవీని డబ్బింగ్ రూపంలో ఆన్ లైన్ లో, ప్రయిమ్ వీడియోల్లో చూసేసారు. అందుకే కథ అందరికీ తెలిసిపోయింది.

అందుకే హీరోయిన్ కి కూడా ఉండేలా కథలో మార్పులు చేస్తేనే ఇటు ఫాన్స్,అటు ఆడియన్స్ కి నచ్చుతుందని అంచనా వేస్తున్నారు. కాటమరాయుడు విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆలస్యం సినిమాను దెబ్బతీసిందని అందుకే లూసిఫర్ లేట్ అయితే మంచిదికాదన్న టాక్ వినిపిస్తోంది. ఈనేపథ్యంలోనే బాబీ డైరెక్షన్ లో మరోకథ సిద్ధంగా ఉండడంతో లూసిఫర్ కన్నా ముందే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలన్న ఆలోచన కూడా ఉందట.