Movies

దశావతారం సినిమా గురించి ఈ నిజాలు తెలుసా …. అసలు నమ్మలేరు

ఎలాంటి పాత్రనైనా, ఎటువంటి సినిమా అయినా చేయడంలో దిట్ట నటుడు కమల్ హాసన్. ఎన్నో విభిన్న పాత్రలతో అలరించిన కమల్ ఆ మధ్య దశావతారం పేరిట ఏకంగా పదిపాత్రలను పోషించి ఔరా అనిపించుకున్నాడు. 108కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ శివాజీ తర్వాత 100కోట్లు దాటిన రెండవ సౌత్ ఇండియన్ మూవీ ఇది. చెన్నై సిటీలోనే ఆరున్నర కోట్లు కలెక్ట్ చేసింది. టెక్నీకల్ వేల్యూస్ టాప్. ఇప్పటికీ మరపురాని మూవీ ఇది. ఎప్పుడో అక్కినేని,శివాజీ గణేశన్ 9పాత్రలు వేశారని ,ఆతర్వాత శ్రీ మద్విరాట్ పర్వంలో ఎన్టీఆర్ 5పాత్రలు వేశారని తెలుసు. కానీ ఈకాలంలొ 10పాత్రలంటే మామూలు విషయం కానేకాదు. పైగా ఓ పాత్రకు మరో పాత్రకు అసలు సంబంధమే ఉండదు. అప్పటికే హిట్ కాంబినేషన్ గా కె ఎస్ రవికుమార్, కమల్ విరాజిల్లుతోంది. సిరాక రంగరాజన్ , క్రేజీ మోహన్,కె ఎస్ రవికుమార్ స్క్రిప్ట్ రెడీ చేయగా,కమల్ స్క్రీన్ ప్లే సమకూర్చాడు. బడ్జెట్ అప్పట్లో 50కోట్లు అంచనా. కమల్ మార్కెట్ 20కోట్లు. ఇక 50కోట్లతో రజనీకాంత్ శివాజీ మూవీ తీయడానికి రెడీ అవుతున్నారు.

అపరిచితుడు 20కోట్ల బడ్జెట్ తో తీస్తే,27కోట్లు వచ్చింది. దాంతోఅపరిచితుడు తీసిన ఆస్కార్ కి కమల్ ఫోన్ చేయడంతో ఒకే అయింది. బడ్జెట్ ఎక్కువ కనుక పలు భాషల్లో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. విద్యాబాలన్, నయనతార,త్రిష కోసం ట్రై చేసారు. శ్రేయకు ఛాన్స్ వచ్చినా శివాజీ డేట్స్ వాళ్ళ ఆసిన్ కంఫర్మ్. మల్లికా షరావత్ కి ఓ పాత్ర ఇచ్చారు. జయప్రద,కె వాసు,కె ఆర్ విజయ కుదిరారు. రెహ్మాన్ కుదరకపోవడంతో ఇమేష్ రేషన్ ని తీసుకుని బ్యాక్ గ్రౌండ్ కి దేవిశ్రీ ప్రసాద్ సెలక్ట్. ఏడాది కాలం ఇలా గడిచాక 2006సెప్టెంబర్ లో మూవీ లాంచింగ్. కుంభ కరేశ్వరంలో ఓ సాంగ్ కి అనుమతి రాకపోవడంతో సెట్ వేసి తీశారు. 170రోజులపాటు ఏకంగా ఒక్కోపాత్రకు 8గంటల మేకప్ తో కేవలం ద్రవ ప్రదార్ధాలు తీసుకుంటూ పూర్తిచేశారు. 10పాత్రలకు స్వయంగా పదియాసాలలో డబ్బింగ్ తానే చెప్పాడు. బామ్మ,వైష్ణవుడు,జార్జిబుష్,పంజాబ్ సింగ్,సి ఐ ఐ ఏజంట్,పోరాట యోధుడిగా ఇలా అన్ని పాత్రలను రక్తి కట్టించాడు.

విదేశాల్లో షూటింగ్, వైట్ హౌస్ సెట్ చెన్నై తెరమణి స్టూడియోలో,క్లైమాక్స్ నెహ్రు స్టేడియంలో తీశారు. సునామీ కోసం మహాబలిపురం లో 50వేల చ అడుగుల ప్లేస్ లో సెటప్ వేశారు. ఇందుకోసం 100అడుగుల గోడ కట్టించారు. సముద్రపు అలలకోసం అమెరికా నుంచి మెషీన్స్ రప్పించారు. రాయిని కంటే పాటకోసం 25రోజులు పడితే ,వేలాడుతూ ఉండే సీన్ 15రోజులు పట్టింది. రెండు సంవత్సరాలపైగా సాగిన షూటింగ్ లో 290రోజుల వర్కింగ్ డేస్ తో పూర్తయింది. సెట్ లో కమల్ ని శృతిహాసన్ కూడా గుర్తుపట్టలేకపోయింది. అంతలా రోజుకో గెటప్. 60కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఆడియో వేడుక 2008ఏప్రియల్ 25న ఘనంగా జరిగింది. హాలీవుడ్ యాక్టర్ జాకీచాన్ చీఫ్ గెస్ట్. అప్పటి తమిళనాడు సీఎం కరుణానిధి,అమితాబ్ బచ్చన్,విజయ్ లాంటి హీరోలంతా వచ్చారు. జూన్ 13న సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో మొదటిసారి 1300ప్రింట్స్ రిలీజయింది. సినిమా అర్ధం కాలేదు కానీ, కమల్ కోసం ఎన్ని సార్లయినా చూడొచ్చు అనే టాక్. మంచి ఓపినింగ్స్. ఈ మూవీ తర్వాత కమల్ ని లోకనాయకుడు అని పిలవడం విశేషం.