Movies

సౌందర్య కెరీర్ లో ఎన్ని హిట్స్,ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో చూడండి

తెలుగులో కొందరు నటీనటులు ఎన్నటికీ గుర్తుండిపోతారు. నటించడం కన్నా ఆ పాత్రల్లో జీవిస్తారని చెప్పాలి. అలాంటి వాళ్లలో మహానటి సావిత్రి తర్వాత సౌందర్య కూడా అంతటి పేరు తెచ్చుకుని కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఈలోకం నుంచి నిష్క్రమించి, అందరిని శోకసంద్రంలో ముంచింది. కన్నడానికి చెందినప్పటికీ తెలుగులో ఎక్కువ సినిమాలు చేసి అందరినీ ఆకట్టుకుంది. అన్ని భాషల్లో చేసినప్పటికీ తెలుగు అమ్మాయిలా ఉంటుంది. 1992లో కన్నడ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ రైతు భరతం మూవీలో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, హిట్ అందుకుంది. తెలుగు,తమిళ,కన్నడ మూవీస్ వరుసగా చేస్తూ ఏ హీరోయిన్ కి దక్కని స్థానం సంపాదించుకుంది.

ఒక ఏడాది అయితే ఏకంగా సౌందర్య 10సినిమాలు చేసింది. రాజేంద్రుడు గజేంద్రుడు మూవీతో టాప్ హిట్ అందుకుని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయింది. అమ్మ నా కోడలా,నెంబర్ వన్,మాయలోడు, ఇనస్పెక్టర్ జానకి,దొంగ అల్లుడు,హలొ బ్రదర్,అమ్మోరు, ,ఇలా ఏడాదికి పది పన్నెండు మూవీస్ చేసింది. 1996లో అమ్మోరు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నంది అవార్డు అందుకుంది. పెదరాయుడులో నటించి భారీ హిట్ కొట్టింది. వెంకటేష్ తో ఎక్కువ సినిమాలు చేసి హిట్ ఫెయిర్ గా నిలిచారు. వెంకీతో పవిత్ర బంధం మూవీతో నంది అవార్డు అందుకుంది.

రాజా సినిమాతో ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్న సౌందర్య ప్రతి సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. అందరి అగ్ర హీరోల సరసన నటించింది. అలాగే తమిళంలో ,కన్నడంలో ఎన్నో అవార్డులు కూడా దక్కించుకుంది. సినిమాలు చేస్తూ రాజకీయాల్లో చేరి బిజెపి తరపున ప్రచారం చేసింది. ప్రచార సమయంలోనే విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. తమిళంలో చేసిన ఆప్త మిత్ర మూవీ చిట్టచివరిది. అయితే ఆమె మరణం తర్వాత విడుదలైంది.