MoviesTollywood news in telugu

Sobhan Babu:ఒకే ఒక సంవత్సరంలో శోభన్ బాబు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఎన్నో తెలుసా ?

Sobhan Babu:టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలతో అలరిస్తూ,సూపర్ స్టార్ గా ఎదిగిన వాళ్ళల్లో శోభన్ బాబు ఒకడు. అప్పటిలో ఎన్టీఆర్,అక్కినేని,కృష్ణ, శోభన్ బాబు స్టార్ హీరోలుగా వెలుగొందారు. ఇందులో శోభన్ బాబు అప్పట్లో అందగాడు.

ఎన్నో మైలురాళ్ళు,రికార్డ్స్ సృష్టించాడు. 1975లో శోభన్ బాబు కెరీర్ లో అరుదైన రికార్డ్స్ సృష్టించారు. ఇలాంటి రికార్డ్స్ ఇప్పటికీ ఏ హీరోకి లేవనే చెప్పాలి. ఆ ఏడాది 8మూవీస్ రిలీజైతే ఆరు సూపర్ హిట్,రెండు యావరేజ్ మూవీస్.

సోగ్గాడు, జీవనజ్యోతి, బలిపీఠం,జేబుదొంగ, దేవుడుచేసిన పెళ్లి ఈ ఐదు సినిమాలు వందరోజులు ఆడాయి. ఇలా ఐదేసి సినిమాలు ఒకే ఏడాది వందరోజుల సినిమాలు ఎన్టీఆర్, అక్కినేని,కృష్ణ లకు కూడా ఉన్నప్పటికీ అయితే మూడు సినిమాలు 10కేంద్రాల్లో వంద రోజులు ఆడడం శోభన్ బాబు రికార్డ్.

సోగ్గాడు 17సెంటర్స్,జీవనజ్యోతి 12కేంద్రాల్లో,జేబు దొంగ10కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శించారు. ఇక ఈ అరుదైన రికార్డ్ 30ఏళ్లకు బద్దలైంది.హైదరాబాద్ లో ఒకే ఏడాది నాలుగు సినిమాలు డైరెక్ట్ వందరోజులు గల ఏకైక హీరో శోభన్ బాబు ఇక ఒకే ఏడాది రిలీజైన 8మూవీస్ 15కేంద్రాలకు పైగా 50డేస్ ఆడడం మరో రికార్డ్. సోగ్గాడు మూవీ సంచలనం సృష్టించి కోటి రూపాయలు వసూలు చేసిన నాల్గవ తెలుగు మూవీగా గుర్తింపు తెచ్చుకుంది.

56రోజులు వరుసగా ఫుల్ అయిన తొలి తెలుగు మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. 8చిత్రాల్లో ఆరు చిత్రాలు టోటల్ గ్రాస్ 6కోట్లకు పైనే.1975ని కెరీర్లో మరపురాని ఏడాదిగా క్రియేట్ చేసుకుని, ఇదే ఏడాది సూపర్ స్టార్ స్టేట్స్ కూడా అనుదుకున్నాడు.