Movies

టాలీవుడ్ లో విలన్స్ గా మెప్పించిన హీరోయిన్స్ ఎంత మంది ఉన్నారో చూడండి

విలన్ అనగానే మగవాళ్లే అనుకుంటారు. కానీ లేడీస్ కూడా విలన్ పాత్రలతో వెండితెరను షేక్ చేసారు. అందునా గ్లామర్ పాత్రలతో అలరించిన హీరోయిన్స్ విలన్స్ గా అవతారం ఎత్తి మరపించారు. విలన్ అనగానే నీలాంబరి పాత్రలో గ్లామర్ స్టార్ రమ్యకృష్ణ గుర్తొస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో పోటీపడి మరీ మెప్పించింది. గూఢచారి 117మూవీలో భానుప్రియ డబుల్ యాక్షన్ చేసి, గ్లామర్ పాత్రతో పాటు నెగెటివ్ రోల్ ని కూడా బాగా పండించింది. నేను మీసం లేని మగాణ్ణి రా అంటూ పొగరు మూవీలో శ్రేయా రెడ్డి పలికిన డైలాగ్ అందరికీ గుర్తే. యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి,సినిమాల్లో విలన్ గా కూడా మెప్పించి నటుడు విశాల్ అన్నయ్యను పెళ్ళాడి సెటిల్ అయింది.

ఆర్ ఎక్స్ 100మూవీతోనే విలన్ గా పాయల్ రాజపుత్ మెప్పించింది. గ్లామర్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రాశి ఐటెం సాంగ్స్ లో మెప్పించడమే కాదు, నిజం మూవీలో విలన్ గోపీచంద్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. హాయ్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నిఖిత కొన్ని సినిమాల్లో చేసి,టాలీవుడ్ కి దూరం అయింది. అయితే చాలా గ్యాప్ తర్వాత నాగార్జున డాన్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. అయితే అది నెగెటివ్ రోల్ అయినా బాగా మెప్పించింది.

ఎన్నో హిట్ మూవీస్ లో చేసిన సౌందర్య నా మనసిస్తా మూవీలో నెగెటివ్ రోల్ పోషించింది. అయితే జనం ఆమెను నెగెటివ్ రోల్ లో చూడలేకపోయారు. తమిళంలో విక్రమ్ నటించిన టైం సినిమాలో సమంత విలన్ గా వేసి,మెప్పించింది. చెన్నై బ్యూటీ త్రిష ఎన్నో గ్లామర్ పాత్రలతో అలరించి పొలిటికల్ థ్రిల్లర్ ధర్మ మూవీలో నెగెటివ్ షేడ్ లో నటించి మెప్పించింది. పదవికోసం ఎంతకైనా తెగించే పాత్రలో ఒదిగిపోయింది. మనసంతా నువ్వే లాంటి సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించిన రీమా సేన్ వల్లభ,యుగానికొక్కడు మూవీస్ లో నెగెటివ్ రోల్స్ వేసి ఆకట్టుకుంది.