శ్రీకాంత్ గురించి ఈ నమ్మలేని నిజాలు మీకోసం…మిస్ కాకుండా చూడండి
హీరో శ్రీకాంత్ టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. హీరోయిన్ ఊహను పెళ్ళిచేసుకుని,ఇప్పుడు కొడుకుని కూడా హీరోగా ఎంట్రీ ఇప్పించాడు. శ్రీకాంత్ సినిమా ఎంట్రీ విశేషాల్లోకి వెళ్తే ఎన్నో వింతలుంటాయి. మేకా పరమేశ్వరరావు,ఝాన్సీ లక్ష్మి దంపతులకు 1968లో కర్ణాటకలోని గంగావతిలో పుట్టిన క్రాంతి సినిమాల్లోకి వచ్చాక శ్రీకాంత్ అయ్యాడు. అందరూ క్రాంత్ అని పిలిచే ఇతడికి అక్క నిర్మల,తమ్ముడు అనిల్ ఉన్నారు. కోస్తా ప్రాంతం నుంచి వ్యవసాయం కోసం కర్ణాటక వెళ్లిన కుటుంబాల్లో శ్రీకాంత్ ఫ్యామిలీ కూడా ఒకటి. అయితే శ్రీకాంత్ కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం.
అందుకే టాలీవుడ్ లో తారల క్రికెట్ కి ఇతడే ప్లాన్ చేసాడు. గంగావతిలో స్కూల్ చదువు పూర్తయింది. ఇక 1980నుంచి చిరంజీవి అంటే బాగా ఇష్టపడేవాడు. ఇక విజయవాడ అక్క ఇంటికి వెళ్ళినపుడు ఇంటర్ చదువుతున్న శ్రీకాంత్ అప్పుడే రిలీజ్ అయిన ఖైదీ సినిమా 4,5సార్లు చూసాడు. ఎలాగైనా చెన్నై వెళ్లి హీరో అయిపోవాలని చిరును స్ఫూర్తిగా తీసుకున్నాడు. తండ్రి దగ్గర 4వేల రూపాయలు తీసుకుని చెన్నై వెళ్ళిపోయాడు. విషయం తెల్సి పేరెంట్స్ వెదకడం మొదలుపెట్టారు. అయితే నాలుగురోజులు చెన్నైలో అన్ని స్టూడియోలు తిరిగి హీరో అవ్వడం అంత ఈజీ కాదని తెల్సి మళ్ళీ విజయవాడ వచ్చేసాడు.
అయితే డిగ్రీ అయ్యాక సినిమాల్లోకి వెళ్తానని చెప్పడంతో వాళ్ళ నాన్న ఏమీ అనలేదు. డిగ్రీ చేసాక ,హైదరాబాద్ వచ్చి మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చేరాడు. శిక్షణ అయ్యాక వేషాలకోసం తిరుగుతుంటే,ఉషాకిరణ్ మూవీస్ యాడ్ చూసి,వెళ్ళాడు. మొత్తానికి సెలక్ట్ అయ్యాడు. అలా పీపుల్స్ ఎన్ కౌంటర్ మూవీలో మావోయిస్టు లీడర్ పాత్ర పోషించగా మంచి హిట్ అయింది. తరవాత సీతారత్నం గారబ్బాయి మూవీలో ఈవీవీ సత్యనారాయణ ద్వారా విలన్ పాత్రకు ఛాన్స్ వస్తే, ఫ్రెండ్స్ సూచన మేరకు ఒకే చేసాడు.
కోట శ్రీనివాసరావు కొడుకుగా నటించిన ఈ మూవీ మంచి హిట్ అయింది. పెళ్ళాం చెబితే వినాలి,ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, ఆశయం,వారసుడు,వంటి సినిమాల్లో విలన్ గా చేస్తూ వస్తుంటే ,తమ్మారెడ్డి భరద్వాజ తీస్తున్న వన్ బై టు మూవీలో శ్రీకాంత్ ని హీరోగా తీసుకున్నారు. ముందు నమ్మకపోయినా తర్వాత నిజమని తెల్సి,అప్పటికే ఒప్పుకున్న నాలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పూర్తిచేసి,వన్ బై టు లో జెడి చక్రవర్తితో కల్సి హీరోగా చేసాడు.
తమిళ హీరోయిన్ ఉమామహేశ్వరి హీరోయిన్ గా ఆమె సినిమా ఈవీవీ తీస్తూ , శ్రీకాంత్ ని హీరోగా పెట్టారు. ఉమామహేశ్వరి పేరుని ఊహగా మార్చడంతో ఆమెకు అలా తొలిసినిమా అయింది. 1994లో రిలీజైన ఈమూవీ హిట్ అయింది. తర్వాత లవ్ గేమ్ లో చేసినా హిట్ అవ్వలేదు. ఎస్వీ కృష్ణారెడ్డి మూవీలో పదినిమిషాల పాత్ర చేసాడు. పాతబస్తీ మూవీ ఆడలేదు. ఇక రామానాయుడు తీసిన తాజ్ మహల్ మూవీలో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ కొట్టాడు. తరవాత రెండు సినిమాలు పెద్దగా పేరురాలేదు.
1996లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి సందడి బ్లాక్ బస్టర్ అయింది. కెరీర్ ని మలుపు తిప్పింది. 25సెంటర్స్ లో వంద ఆడిన సినిమా. ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన వినోదం, ఊయల,ఈవీవీ తీసిన తాళి,చాలా బాగుంది ఇలా ఈ ఇద్దరు డైరెక్టర్స్ తో ఒకరి తర్వాత ఒకరి సినిమాల్లో చేసి హిట్ మీద హిట్ అందుకున్నాడు. అక్కినేని తో కల్సి పండగ మూవీ అలాగే నాగార్జునతో కల్సి నిన్నే ప్రేమిస్తా లో నటించాడు . 2005వరకూ ఫ్యామిలీ హీరోగా రాణించిన శ్రీకాంత్ ఆతర్వాత కృష్ణవంశీ డైరెక్షన్ లో ఖడ్గం మూవీతో మాస్ లుక్ తెచ్చుకున్నాడు. పెళ్ళాం ఊరెళితే మూవీలో వేణుతో కల్సి చేసాడు,విశ్వనాధ్ తో స్వరాభిషేకం,బాపుతో రాధాగోపాళం వంటి మూవీస్ చేసాడు.
చిరంజీవితో శంకర్ దాదా ఎంబిబిఎస్,వెంకీతో కలిసి సంక్రాంతి మూవీలో చేసాడు. పోసాని కృష్ణ మురళి తీసిన ఆపరేషన్ దుర్యోధన మూవీలో నటించి ఔరా అనిపించాడు. యమగోల మళ్ళీ వచ్చిందిలో నటించి, వందవ సినిమాగా కృష్ణ వంశీ డైరెక్షన్ లో మహాత్మా మూవీ చేసాడు. అక్కడ నుంచి శ్రీకాంత్ కి పెద్దగా హిట్స్ లేవు.

