నువ్వు నేను సినిమా వెనక ఉన్న నమ్మలేని నిజాలు….అసలు నమ్మలేరు
చిత్రం మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన తేజ 40లక్షలతో సినిమా చేసి, 9కోట్లకు పైగా వసూలు చేసిన ఘనత సాధించాడు. అప్పటిదాకా కెమెరామెన్ గా ఉన్న తేజ ఒక్క మూవీతో ఫేమస్ అవ్వడంతో ప్రొడ్యూసర్స్ క్యూ కట్టారు. డబ్బుకన్నా మనిషి నచ్చితేనే సినిమా చేస్తాడు. అలా సుంకర మధు మురళి,జెమిని కిరణ్ లకు మాటిచ్చాడు. మధు మురళీ ప్రొడ్యూసర్స్ గా ఫ్యామిలీ సర్కస్ మూవీ అవుతోంది. ఇక జెమిని కిరణ్ ప్రొడ్యూసర్ గా వెంకటేష్ తో సినిమాకు కథ చెప్పాడు. రెండు సాంగ్స్ కూడా ఆర్పీ పట్నాయక్ తో రికార్డింగ్ చేయించాడు. కథ విషయం వెంకీ తేల్చలేదు. దీంతో ఈ సినిమా ఉండదని తేలింది. కారులో వస్తుంటే రోడ్డుపై గొఱ్ఱెలమంద తోలుతున్న అమ్మాయి,ఖరీదైన కారులో ఓ యువకుడు అసహనంగా ఉన్నాడు. గొర్రెలను ఆ అమ్మాయి పక్కకు తోలెయ్యడంతో తేజ ఆఫీసుకి వచ్చేసాడు.
భోజనం ముగించి జెమిని కిరణ్ కి కథ అవుట్ లైన్స్ సీన్స్ తో సహా చెప్పాడు. అమ్మాయి గొర్రెల కాసుకునే వాడి కూతురు. అబ్బాయ్ రిచెస్ట్ మ్యాన్ కొడుకు. ఇద్దరి మధ్య ప్రేమ. ఇది విన్నవెంటనే కిరణ్ ఒకే చెప్పేసి ముహూర్తానికి రెడీ అన్నాడు. అసోసియేట్ తో కల్సి స్క్రిప్ట్ పూర్తిచేసాడు. పేరు నువ్వు నేను. జనవరి 4న షూటింగ్ స్టార్ట్. హీరో హీరోయిన్స్ ఎవరో ఇంకా తెలీదు. తొలిరోజు తనికెళ్ళ భరణి,తెలంగాణ శకుంతల తో షూటింగ్ స్టార్ట్ అయింది. హీరోగా సుమంత్ ని అడిగితె నో చెప్పాడు. మాధవన్ తెలుగు మూవీస్ చేయనన్నాడు. అయితే చిత్రంతో హీరోగా వచ్చిన ఉదయ్ కిరణ్ కి తేజ అంటే గౌరవం. అందుకే తరచూ వచ్చి,సూచనలు తీసుకునేవాడు. హోలీ సినిమాకు డేట్స్ అలానే ఇచ్చాడు. అయితే ఆరోజు ఉదయ్ ని చూడగానే తేజలో ఆలోచన తళుక్కున మెరిసింది. జిమ్ చేసి బాడీ పెంచు,సెకండ్ సినిమాకి నువ్వే హీరో అని తేజ చెప్పడంతో ఉదయ్ ఎగిరి గంతేసాడు.
ఈలోగా ఫామిలీ సర్కస్ రిలీజయి,తేడా కొట్టడంతో తేజలో కసి పెరిగింది. హీరోయిన్ కోసం ముంబై నుంచి ఆడిషన్స్ కి వచ్చారు. అందులో ఓ అమ్మాయి బాగుంది. కానీ చాలా ఫోజు కొడుతూ ఫైవ్ స్టార్ హోటల్ అవీ ఇవీ అని అంటోంది. దాంతో తేజలో అసహనం. ఇక్కడ ఉన్నవాళ్లలో లీస్ట్ ఎవరో చూపించు అన్నాడు తేజ. దాంతో ఆమె ఓ అమ్మాయిని చూపించింది. అయితే ఆమె నా హీరోయిన్, ఇక నువ్వేళ్లొచ్చు అని తేజ చెప్పేసాడు. అలా సెలక్ట్ అయింది అనిత. ఇక సినిమాలో ఎం ఎస్ నారాయణ, ధర్మవరపు కామెడీలో అనుకోకుండా ధర్మవరపు క్యారెక్టర్ పెంచేసి,ఎం ఎస్ క్యారెక్టర్ తగ్గించాడు.
ఇక నెగెటివ్ రోల్ లో తెలంగాణ శకుంతల మీద డౌట్ వచ్చి బెంగుళూరు పద్మను పిలిచి ఓ రోజు షూట్ చేసాడు. అయితే తనికెళ్ళ విషయం చెప్పడంతో శకుంతల ఎంటర్ అయింది. వైజాగ్ ప్రసాద్ ని హీరో తండ్రి రోల్ కి సెలెక్ట్. గాజువాక పిల్ల తో పాటు వెంకీ మూవీ కోసం రికార్డ్ చేసిన మరో పాట తుమ్మెదా అనే పల్లవి తీసేసి,ప్రియతమా అని మార్చేసి మొత్తం 11సాంగ్స్ . కోటి 63లక్షలతో మూవీ రెడీ. మార్నింగ్ షో కి బ్లాక్ బస్టర్ టాక్. ఈ మూవీతో తేజ స్టార్ డైరక్టర్ అయ్యాడు. ఉదయ్ కిరణ్ స్టార్ హీరో,ధర్మవరపు స్టార్ కమెడియన్, ఆర్పీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ .. ఇలా అందరికీ బ్రేక్ ఇచ్చిన ఈ మూవీ21కోట్ల వరకూ కలెక్ట్ చేసింది.

