బాలీవుడ్ హీరోలను భయపెడుతున్న టాలీవుడ్ హీరోలు…ఎలానో చూడండి
ఒకప్పుడు బాలీవుడ్ కి పరిమితమైన పాన్ ఇండియా సిన్మాలు ఇప్పుడు తెలుగు స్టార్స్ కూడా చేస్తున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలితో పాన్ ఇండియా మూవీస్ కి టాలీవుడ్ స్టార్స్ కేరాఫ్ గా మారారని చెప్పొచ్చు. భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నప్పుడు అన్ని భాషల్లో విడుదల చేసి,మార్కెట్ పెంచుకోవాలని అందరిలో వచ్చేస్తోంది. బాలీవుడ్ కి ధీటుగా మనవాళ్ళ సినిమాలు వస్తున్నాయి.
జక్కన్న తీస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల నటన నువ్వా నేనా అన్నట్లు ఉండబోతోంది. త్వరలో సెట్స్ మీదికి వెళ్లే పుష్ప వరకూ అన్నీ పాన్ ఇండియా మూవీ గానే తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా తీస్తున్న పూరి జగన్నాధ్ డైరెక్షన్ లోని ఫైటర్ మూవీ కూడా పాన్ ఇండియా గా రూపొందుతోంది. ఇక ప్రభాస్ అయితే తెలుగు ,హిందీలలో కూడా పాన్ ఇండియా మూవీస్ చేసేస్తున్నాడు.
మనోళ్లు సినిమాలు ఇతర భాషల్లో రిలీజ్ అవుతూ దుమ్మురేపుతుంటే,బాలీవుడ్ హీరోలు ఉలిక్కిపడుతున్నారు. అలాగని నార్త్ ఇండియా స్టార్లు ఇక్కడ సినిమాలు రిలీజ్ చేసినా ఫలితం ఉండడంలేదు. ఒకప్పుడు హిందీ మూవీస్ కి ఏపీలో మంచి క్రేజ్ ఉండేది. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. కానీ టాలీవుడ్ హీరోలు ఎక్కువ ఖర్చు చేసి తీసే సినిమాలు అక్కడ రిలీజ్ అవ్వడమే కాదు,కలెక్షన్స్ కూడా రావాలి. అప్పుడే కదా విలువ. అందుకే బన్నీ ప్లాన్ గా తెలుగులోనూ కేరళలోనూ మార్కెట్ తెచ్చుకుని, ఇప్పుడు మిగిలిన భాషలపై ఫోకస్ పెట్టాడు. అందుకే పుష్పాల బాలీవుడ్ స్టార్స్ ని భయపెడుతున్నారు. మరి బన్నీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

