Movies

నాగార్జున నటించిన హిందీ సినిమాల్లో ఎన్ని హిట్స్ ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో ?

టాలీవుడ్ అమితాబ్ గా గుర్తింపు పొందిన కింగ్ నాగార్జున మొదట్లో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికే ఆ తర్వాత తన టాలెంట్ తో ఫాన్స్ ని సొంతం చేసుకున్నాడు. తెలుగులో వరుస హిట్స్ తో దూసుకెళ్తూ బాలీవుడ్ లో కూడా సత్తాచాటాడు. నాగ్ కంటే ముందు రజినీ, కమల్ హాసన్ ఎక్కువ హిందీ చిత్రాల్లో నటించారు. సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోల్లో నాగార్జున అక్కినేని ఒకడిగా నిలిచాడు. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ద్వారా మరోసారి బాలీవుడ్‌లో నటిస్తున్న నాగార్జునతో పాటు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇప్పటికే కంప్లీట్ అయింది

అయితే తెలుగులో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన శివ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. నాగ్ కెరీర్ ని మార్చింది. దాంతో నాగార్జున హిందీలో కూడా రీమేక్ చేసారు. అదే టైటిల్‌తో హిందీలో దాదాపు అదే ఆర్టిస్టులతో బాలీవుడ్‌లో రీమేక్ చేసారు. ఈ చిత్రం బీటౌన్‌లో కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత హిందీలో అమితాబ్ బచ్చన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఖుదా గవా’ చిత్రంలో రెండో హీరో పాత్రలో నాగ్ నటించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెలుగులో ‘అంతం’ మూవీని హిందీలో ‘ద్రోహి’ పేరుతో బై లింగ్వల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది.ఇక మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రిమినల్’ చిత్రం కూడా తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి తీశారు. తెలుగులో యావరేజ్‌గా నిలిచిన ఈ చిత్రం హిందీలో మాత్రం సూపర్ హిట్‌.

ఇక కే.భాగ్యరాజ్ దర్శకత్వలో వచ్చిన ‘మిస్టర్ బేచారా’ చిత్రంలో కూడా నాగ్ చేసాడు. అయితే ఈ చిత్రంలోఅనిల్ కపూర్, శ్రీదేవి ముఖ్యపాత్రల్లో నటించారు.మహేష్ భట్ దర్శకత్వంలో ‘అంగారే’ అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కూడా మరో హీరోగా నటించారు. వరుసగా మూడోసారి మహేష్ భట్ దర్శకత్వంలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన ‘జక్మ్’ చిత్రంలో హీరో తండ్రి పాత్రలో నటించాడు. ’అగ్నివర్ష’ అనే హిందీ చిత్రంలో ముఖ్యపాత్రలో నాగార్జున నటించారు. ‘బార్డర్’ మూవీ తర్వాత జేపీ దత్తా కార్గిల్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కించిన ‘ఎల్ ఓ సి ’ కార్గిల్ మూవీలో నాగార్జున మేజర్ పద్మపాణి ఆచార్య పాత్రలో నటించి మెప్పించాడు.