MoviesTollywood news in telugu

Anchor Suma:స్టార్ యాంకర్ సుమ పిన్ని కూడా మనం రోజు బుల్లితెర పై చూస్తున్ననటి…ఎవరో తెలుసా?

Anchor Suma and Indu Anand:బుల్లితెర రంగం వచ్చిన దగ్గర నుంచి దాన్నే అంటిపెట్టుకుని అలరించే వాళ్ళెందరో ఉన్నారు. అందులో అగ్రగామిగా స్టార్ యాంకర్ సుమ గురించి ప్రస్తావిస్తే, రెండున్నర దశాబ్దాలుగా తన హవా సాగిస్తోంది. టివి ప్రోగ్రామ్స్ మాత్రమే కాదు,సినిమా ఫంక్షన్స్,ఈవెంట్స్ లో సుమ హవా సాగిపోతూనే ఉంది. ఇక సీరియల్ పరంగా చూస్తే చక్రవాకం సీరియల్ ఒకప్పుడు అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. అందులో ఇందు ఆనంద్ తన నటనతో ఆడియన్స్ లో చెరగని ముద్రవేసింది. బుల్లితెర అన్నపూర్ణమ్మ ఆకట్టుకున్న ఇందు ఆనంద్ అమ్మగా, అమ్మమ్మగా ఇలా ఎన్నో పాత్రలతో టివి రంగాన్ని ఓ ఊపు ఊపేసింది.

ఎలాంటి సినిమా నేపధ్యం లేకుండా సీరియల్ నటిగా ఇందు ఆనంద్ తన నటనతో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంది. కేరళకు చెందిన ఈమె పెళ్ళిచేసుకుని హ్యాపీ గా జీవితం వెళ్లదీస్తున్న సమయంలో టివి రంగంలో ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. హిందీలో సహస్ర పంత్ సీరియల్ తో బుల్లితెర రంగంమీద అడుగుపెట్టింది. ఆతర్వాత ఎన్నో హిందీ సీరియల్స్ లో చేసింది. ఇక బొంబాయి ప్రియుడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్ గా చేస్తూ, తెలుగు బుల్లితెర రంగంపై చక్రవాకంతో ఎంట్రీ ఇచ్చింది .

ఎంబీఏ చదివిన ఇందు ఆనంద్ ఫ్యాషన్ డిజైన్ కోర్సులు చేసింది. 20ఏళ్ళవయస్సులోనే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. ఈమె భర్త పెద్ద ప్రభుత్వ ఉద్యోగి. వీరికి ఒక కూతురు ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దీ రోజుల్లోనే ఈమె డబ్బింగ్ చెప్పుకోవడం ప్రారంభించారు. ఇక శ్రావణ సమీరాలు సీరియల్ లో అన్నపూర్ణమ్మ పాత్రతో ఇందు ఆనంద్ అందరికీ దగ్గరయ్యారు. కల్యాణ వైభోగమే ,కోయిలమ్మ సీరియల్స్ తో బామ్మగా నటించారు. అయితే కేరళ అనగానే స్టార్ యాంకర్ సుమ కూడా గుర్తొస్తుంది. సుమ అమ్మమ్మ, ఇందు ఆనంద్ అమ్మ స్వయాన అక్కాచెల్లెళ్లు. దీంతో సుమకు ఇందు ఆనంద్ పిన్ని అవుతారు. ఆవిధంగా వీరిద్దరూ బుల్లితెరను ఏలేస్తున్నారు.