Beauty Tips

గులాబీ రంగు పెదాలు మీ సాంతం కావాలంటే…ఇలా చేస్తే సరి

ఎదుటివారిని ఆకట్టుకోవాలన్నా లేదా వారికీ మీ మీద మంచి అబిప్రాయం ఏర్పడాలన్న చిరునవ్వు ఒక సాధనం. ఆ చిరునవ్వుకు కారణం పెదవులు. సహజంగానే పెదవులు సున్నితంగానూ మరియు మంచి రంగులో ఉంటాయి. చాలా మంది తరచూ పెదవులు కొరుకుతూ ఉంటారు. ఇది మంచి పద్దతి కాదు. అలా కొరకటం వలన పెదవులు అందవికారంగా మారతాయి. వాటి సహజత్వాన్ని కోల్పోకుండా చూసుకోవటంతో పాటు మరింత నిగారింపు కోసం కొన్ని చిట్కాలు గురించి తెలుసుకుందాము.

తేనే సౌందర్య సాధనంగా ఉపయోగపడుతున్నా సంగతి మనకు తెలుసు. అర టీ స్పూన్ తేనెను తీసుకోని పెదవులకు పట్టించి కొద్దిసేపు ఆరనివ్వాలి. ఈ విధంగా వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి పలితం ఉంటుంది.

రాత్రి సమయంలో వేజ్లిన్ ను పైనాపిల్ జ్యూస్ తో కలిపి రాస్తే కూడా మంచి పలితం ఉంటుంది.

పెదవుల చుట్టూ మొటిమలు,చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే పెదవుల వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కానీ దీనిని నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.

ఒకటి,రెండు చుక్కల ఆలివ్ ఆయిల్,అర టీ స్పూన్ చక్కర కలిపి పెదాలకు రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వీలైనన్ని సార్లు చేస్తే పెదవులు మృదువుగా,అందముగా ఉంటాయి.

పెదవులు గులాబి రంగులో ఉండాలంటే టమోటాలను గుజ్జులా చేసి దానిలో కొన్ని పచ్చి పాలు కలిపి పెదవులకు రాయాలి. ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే క్రమేపి పెదవుల రంగు మరే అవకాశం ఉంది.

కొన్ని గులాబీ రేకులను,పాలమీగడను కలిపి పేస్ట్ చేసి పెదవులకు రాసిన మంచి పలితం కనపడుతుంది.

పెదవులు డీ హైడ్రేట్ కాకుండా ఉండాలంటే రోజు మొత్తంలో ఏడు లేదా ఎనిమిది గ్లాసుల నీటిని తప్పనిసరిగా త్రాగాలి. ఈ విధంగా త్రాగితే డీ హైడ్రేట్ లేకుండా ఉంటుంది.