బాదం షర్బత్
కావలసిన పదార్థాలు:
బాదం పప్పు : 1 కప్పు
ఆకు పచ్చని యాలకులు :6 -7
మిరియాలు : 1 చిన్న చెంచా
చక్కెర : 2 కప్పులు
నీళ్లు : ౩ కప్పులు
బాదం ఎసెన్స్ : 2చుక్కలు
తయారి విధానం :
బాదం పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మర్నాడు ఉదయం బాదం పప్పు కి మిరియాలు, యాలకులు చేర్చి మెత్తగా గ్రెండ్ చేయాలి. నీళ్ళలో చక్కెర వేసి కరిగాక వడకట్టాలి. స్టవ్ మీద పెట్టి తీగ పాకం వచ్చే దాక మరిగించాలి. గ్రెండ్ చేసిన మిశ్రమాన్ని ఈ పాకానికి చేర్చి రెండు మూడు పొంగులు వచ్చే దాక వేడి చేయాలి. చల్లారిన తర్వాత బాదం ఎసెన్స్ కలిపి బాటిల్స్ లో నింపి పెట్టుకోవాలి. చల్లని పాలు కలిపి తాగాలి.

