చర్మ తత్వాన్ని బట్టి తీసుకోవలసిన జాగ్రత్తలు
సాదారణంగా మనం మన చర్మ తత్వాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.
పొడి చర్మం
.చర్మంలో తేమ లేకపోవుట వలన చర్మం పొడిగా మారుతుంది. పొడిబారిన చర్మం తాకినప్పుడు ఎండినట్లు మరియు కరుకుగా ఉంటుంది. ఈ చర్మం ఉన్నవారు తరచూ క్లేన్సర్ క్రీం తో ముఖాన్ని రుద్ది తర్వాత తడిపిన కాటన్ బాల్ తో ముఖాన్ని శుభ్రం చేయాలి. ఈ విధంగా చేయుట వలన ముఖానికి పట్టిన చెమట,మురికి,బ్యాక్టీరియ పోతుంది. పొడి చర్మం కోసం తయారుచేసిన టోనర్ ను ముఖానికి రాస్తూ ఉండాలి. విటమిన్ E తో కూడిన మాయిశ్చరై జర్ ను తరచుగా రాస్తూ ఉండాలి.
జిడ్డు చర్మం
ఈ చర్మం ఉన్నవారికి చర్మ రంద్రాల నుండి ఎక్కువ శాతం నూనె ఉత్పత్తి అవుట వలన జిడ్డుగా ఉంటుంది. దీనివలన బ్లాక్ హెడ్స్,మొటిమలు వస్తాయి. ఇలాంటి చర్మ తత్త్వం ఉన్న వారు ఔషద గుణాలు ఉన్న సబ్బులు లేదా నాన్ అల్కాలేన్ సబ్బులతో శుభ్రం చేయాలి. వారంలో రెండు,మూడు సార్లు స్క్రబ్స్ తో పట్టిన మురికి,జిడ్డును తొలగించాలి. లేకుంటే చర్మ గ్రందులు మూసుకొనిపోతాయి. నీటితో తయారుచేసిన మాయిశ్చరై జర్ లను మాత్రమే ఉపయోగించాలి.
కాంబినేషన్ చర్మం
ముఖం పై కొన్ని చోట్ల పొడిగాను,కొన్ని చోట్ల జిడ్డుగాను ఉంటే అటువంటి చర్మాన్ని కాంబినేషన్ చర్మం అని అంటారు. ఇలాంటి వాళ్ళు ముఖంపై ఏ భాగం పొడిగా మారుతుందో ఆ భాగానికి మాయిశ్చరై జర్ వాడాలి. జిడ్డుగా ఉన్న భాగం వద్ద నాన్ అల్కాలేన్ సబ్బులను వాడాలి. రోజ్ వాటర్ తో తయారుచేసిన టోనర్ లు ఈ చర్మ తత్త్వం ఉన్నవారికి బాగా ఉపయోగపడతాయి.

