Movies

ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

టాలీవుడ్ లో గోపీచంద్ సరసన ఒంటరి సినిమా లో నటించిన కేరళ కుట్టి భావన ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె తెలుగులో తక్కువ సినిమాలు చేసినా తన అభినయంతో బాగానే ఆకట్టుకుంది. తెలుగులో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే కొన్ని వ్యక్తిగత కారణాల తో సినీ పరిశ్రమకు దూరం అయింది. అప్పటి నుంచి మరి ఏ సినిమాలోనూ నటించలేదు.

మరలా ఇప్పుడు కన్నడంలో ఇన్స్పెక్టర్ విక్రమ్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ అంతా పూర్తి అయింది. కరోనా కారణంతో విడుదల వాయిదా పడింది. అలాగే బజరంగీ 2 సినిమాలో నటించటానికి భావన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే భావన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్టే. భావన చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది