Movies

చంద్రముఖి సినిమాలో ఉన్న కొన్ని నమ్మలేని నిజాలు….ఎన్ని కోట్ల లాభమో ?

రజనీకాంత్,రమ్య కృష్ణ పోటాపోటీగా నటించిన చంద్రముఖి మూవీ ఓ సంచలనం. తర్వాత వచ్చిన బాబా మూవీ డిజాస్టర్ తో రెండేళ్లు రజనీకాంత్ సైలెంట్ గా ఉన్నాడు. ఒకరోజు శివాజీ గణేశన్ ఇంటికి వెళ్ళాడు. ఆరోజు శివాజీ జయంతి కావడంతో చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించాడు. నిజానికి శివాజీ గణేశన్ చాలా సార్లు భోజనానికి పిలిచినా రావడానికి కుదరక ఆరోజు వచ్చి, భారంగా గడిపి, చివరకు భోజనం చేసి మరీ, వెళ్తుంటే మీడియా చుట్టుముట్టింది. పెద్దాయన పెట్టిన శివాజీ ప్రొడక్షన్స్ లో సినిమా చేస్తున్నా అంటూ ఎప్పుడూ మాట్లాడని రజనీ చెప్పేసరికి అందరూ షాకయ్యారు. కర్ణాటక వెళ్లి ఆప్తమిత్ర మూవీ చూస్తూ ఏదో ఆలోచనలో పడ్డ రజనీ, వెంటనే పి వాసుకి, ప్రభుకి ఫోన్ చేసి ఆప్తమిత్ర తమిళంలో రీమేక్ చేస్తున్నాం అని చెప్పాడు.

వాసు కథ తయారు చేస్తుంటే రజనీ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. దెయ్యం పేరు నాగవల్లి అనుకుంటే పూర్వం పేరు ఉండాలని చంద్రముఖి అని పెట్టారు. ఆప్తమిత్రలో హౌలా హౌలా అనే డైలాగ్ ఉంటుంది. కానీ రజనీకి నచ్చలేదు. చిన్నప్పుడు చూసిన నాటకంలోని లకలక లకలక డైలాగ్ గుర్తొచ్చి అదే పెట్టమన్నాడు. అతడి మేనరిజం కి సూటయింది. స్నేహ,రీమాసేన్,ఇలా ఆలోచించి సిమ్రాన్ ని అనుకున్నారు. ఇక దుర్గ పాత్రకు కొత్త అమ్మాయి కావాలని నయనతారను సెలెక్ట్ చేసారు. కానీ మెయిన్ రోల్ చేసే సిమ్రాన్ కి ప్రెగ్నెన్సీ కావడంతో యూనిట్ షాక్ తింది. దాంతో ఆ ఛాన్స్ జ్యోతికకు దక్కింది.

షూటింగ్ దాదాపు హైదరాబాద్ లోనే తీసి, సాంగ్స్ కి టర్కీ వెళ్లారు. కొంత భాగం చెన్నైలో తీసి,మొత్తానికి చాలా వేగంగానే షూటింగ్ పూర్తిచేశారు. 2005ఏప్రియల్ 14న తెలుగు,తమిళ భాషల్లో విడుదలైంది. సూపర్ హిట్ టాక్. ఇండియాలో 45కోట్లు వసూలు చేసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ 75కోట్లు కలెక్ట్ చేసి,విడుదలైన అన్ని భాషల్లో విజయడంఖా మోగించింది. తమిళనాట 175రోజులు ఆడడం ద్వారా రికార్డ్ క్రియేట్ చేసింది. చెన్నై శాంతి థియేటర్ లో 890రోజులు నడిచి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆ సినిమాతో రజనీ హవా స్టార్ట్ అయింది. నిజానికి శివాజీ ప్రొడక్షన్స్ లో సినిమా చేసి ,విజయోత్సవ సభలో 50వ సినిమా ఇదే సంస్థలో చేస్తానని చెప్పి,మాట ప్రకారం చంద్రముఖి చేసాడు. 15కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ,అప్పట్లో ఇదే టాప్ అన్నట్లు తేలింది.