Health

వర్షాకాలంలో ఈ టీ తాగుతున్నారా… మిస్ కాకుండా చూడండి

వానలు వస్తున్నాయి. వానలు వస్తున్నాయంటే దగ్గు జలుబు గొంతు నొప్పి వంటివి వచ్చేస్తాయి. ఇవి వచ్చాయంటే ఒక పట్టాన తగ్గవు. అందుకే ఈ వాన కాలంలో హెర్బల్ టీ తాగితే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో మలినాలను బయటికి పంపడమే కాకుండా హానికరమైన బ్యాక్టీరియాను కూడా తగ్గిస్తుందట. హెర్బల్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధులకు కారణమయ్యే వైరస్ ను నియంత్రిస్తుంది.

వానకాలంలో డ్రై ఫ్రూట్స్ తింటే శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. పెరుగు తీసుకుంటే పెరుగులో ఉండే ప్రోటీన్ ప్రోబయోటిక్స్ శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలంగా చేస్తాయి. అంతేకాకుండా మిరియాలు పసుపు దాల్చినచెక్క వంటివి కూడా భాగంగా చేసుకుంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది