ఎస్వీ కృష్ణారెడ్డి – అచ్చిరెడ్డి సక్సెస్ కి కారణం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు
ఎన్నో సూపర్ హిట్ మూవీస్ అందించిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి పేరు చెప్పగానే వెంటనే కె. అచ్చిరెడ్డి పేరు వినిపిస్తుంది. అసలైన మిత్రులుగా వీరిద్దరూ 30ఏళ్లుగా కల్సి ప్రయాణం చేస్తూ, సినిమా రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. పశ్చిమ గోదావరి జిల్లా అరవిల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వీరిద్దరూ బాల్య స్నేహితులే. స్కూల్ డేస్ అయ్యాక ఇద్దరూ వేరువేరు కాలేజీల్లో చదువుకున్నారు. ఎక్కడున్నా ఇద్దరూ టచ్ లో ఉండేవారు. ఎస్వీ కృష్ణారెడ్డి ఎంకాం పూర్తిచేసాక, సినిమాల కోసం చెన్నై వెళ్లిపోయారు. అచ్చిరెడ్డి వ్యాపారంలో దిగి, హైదరాబాద్ లో సెటిలయ్యారు.
పగడాల పడవ, రాక్షసుడు మూవీస్ లో నటించిన కృష్ణారెడ్డికి పెద్దగా పేరు రాలేదు. హైదరాబాద్ వచ్చేసి, అచ్చిరెడ్డితో కల్సి చిన్నచిన్న వ్యాపారాలు చేసారు. కానీ ఎందులోనూ కృష్ణారెడ్డి సంతృప్తి చెందలేదు. అయితే చిన్నప్పటి నుంచి సినిమాలపై మోజు ఉండడంతో ఏదో అద్భుతం సృష్టిస్తాడని అచ్చిరెడ్డి నమ్మారు. దీంతో సినిమా వ్యాపారంలో దిగాలని భావించి, దూరదర్శన్ కి సినిమాల శాటిలైట్ హక్కులు అమ్మే వ్యాపారం స్టార్ట్ చేసారు. సర్వర్ సుందరం మూవీ డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల బాధ్యత చేపట్టారు. తర్వాత కిషోర్ రాఠీలో తో కల్సి వీడియో కెసెట్స్ వ్యాపారం చేసారు. డబ్బింగ్ సినిమాలపై దృష్టి పెట్టి, మలయాళంలో ముమ్ముట్టి హీరోగా హిట్ అయిన మూవీని తెలుగులో సూర్య ది గ్రేట్ గా రిలీజ్ చేసి, ప్రొడ్యూసర్స్ గా సినిమా ప్రయాణం స్టార్ట్ చేసారు.
తర్వాత ముమ్ముట్టి హీరోగా వచ్చిన మరో మూవీని దర్యాప్తు పేరిట రిలీజ్ చేశారు. బాగా లాభాలు రావడంతో దాంతో డైరెక్ట్ మూవీ చేయాలని , రాజేంద్రప్రసాద్ తో కొబ్బరి బొండాం మూవీ చేసారు. ఒక నిర్మాతగానే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం కూడా కృష్ణారెడ్డి అందించారు. కిషోర్ రాఠీతో కల్సి మనిషా ఫిలిమ్స్ బ్యానర్ పై తీసిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడు,తో సక్సెస్ తో దూసుకెళ్లారు. 12మూవీస్ చేసి విజయానికి కేరాఫ్ ఎడ్రెస్ అయ్యారు ఈ ఇద్దరు మిత్రులు. స్నేహంలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండాలి గానీ కోపాలు తాపాలు ఉండకూడదని వీరు చెప్పే మాట. అందుకే 5దశాబ్దాలుగా వీరి స్నేహం చెదరకుండా సాగుతోంది.

