MoviesTollywood news in telugu

2020 లో టాలీవుడ్ కి దూరం అయిన సెలబ్రేటీస్

Tollywood Celebrities Died In 2020 : పుట్టినవాడు గిట్టక మానడనే సామెత ఉన్నా, అనుకోకుండా కొందరు సెలబ్రిటీలు బలైపోయారు. 2020కరోనా ఎఫెక్ట్ కూడా పెద్ద ప్రభావం చూపింది. అందులో ముఖ్యంగా ఆగస్టు 5న కరోనాతో ఆసుపత్రిలో చేరిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25న ఈ లోకం నుంచి నిష్క్రమించి, సంగీత ప్రియులను దుఃఖ సాగరంలో ముంచెత్తారు.

రాయలసీమ యాసతో విలన్ గా బ్యాయపెట్టే పాత్రలతో పాటు నవ్వించే కామెడీ పాత్రలతో కూడా మెప్పించిన నటుడు జయప్రకాశ్ రెడ్డి సెప్టెంబర్ 8తెల్లవారు ఝామున గుండెపోటుతో కన్నుమూశారు. 74సంవత్సరాల జయప్రకాశ్ రెడ్డి చివరిసారిగా సరిలేరు నీకెవ్వరు మూవీలో చేసారు.

ఇక టివి,సినిమాల్లో కూడా తన నటనతో అలరించిన నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనా బారిన పడి 23రోజులు చికిత్స పొంది, సెప్టెంబర్ 23న తుదిశ్వాస విడిచారు. సీనియర్ నటుడు రావి కొండలరావు గుండెపోటుతో జులై 28న కన్నుమూశారు. ఇక ఎన్నో సీరియల్స్ లో నటించిన శ్రావణి ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఈమె కేసులో దేవరాజ్, సాయికృష్ణ అనే వ్యక్తులతో పాటు, ఆర్ ఎక్స్ 100ప్రొడ్యూసర్ కూడా అరెస్ట్ అయ్యాడు.