సినిమాల్లో దూసుకు వెళ్ళుతున్న అనసూయ..మరో స్టార్ హీరోతో…!?
Anchor Anasuya :అనసూయ.. పేరు వినగానే గుర్తొచ్చేది జబర్దస్త్ కామెడీ షో. ఈ షోతో పాపులార్టీ తెచ్చుకుని, ఇంకా పలు షోస్ తో బుల్లితెరపై హాట్ యాంకర్‌గా ప్రస్థానం సాగిస్తూనే, సినిమాల్లో కూడా సత్తా చాటుతోంది. చిన్నా, పెద్ద పాత్ర పట్టించుకోకుండా వైవిధ్య పాత్రలను ఎంచుకుంటూ, సినిమాల్లో వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది. ఇప్పటికే పలు సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో నటించిన ఈ అమ్మడు, థ్యాంక్యు బ్రదర్ అనే చిత్రంలో నటించింది. ఇప్పటికే షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో థియేటర్లలోకి రానుంది. మరోవైపు కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న రంగ మార్తండలోనూ అనసూయ దేవదాసి పాత్రలో కనిపించబోతోందని టాక్.
ఇదిలా ఉంటె ఇప్పుడు మరో బంపరాఫర్ కొట్టేసింది. ఇక ఈ సంక్రాంతికి మాస్ రాజా రవితేజ హీరోగా రిలీజైన క్రాక్ విజయంం తర్వాత ఖిలాడిలో ఒక కీలక పాత్రలో నటించనుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనగా ఖిలాడి టీమ్ అనసూయకు స్వాగతం చెబుతున్నట్లు ఒక పోస్టర్ రిలీజయింది. థ్రిల్లర్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఖిలాడికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
రవితేజ సరసన డింపుల్ హయతీ, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్ గా చేస్తున్నారు యాక్షన్ కింగ్ అర్జున్, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు సమకూరుస్తున్నాడు. పెన్ స్టూడియోస్, హవీష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీని మేలో విడుదల చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. ఈ మూవీకి గేమ్ ఛేంజర్ అనసూయ అని దర్శకుడు కామెంట్ కూడా పెట్టారు. దీన్నిబట్టి ఈ మూవీలో విలన్ తరహా పాత్రలో అనసూయ కనిపించనున్నట్లు అర్ధం అవుతోంది.

