సూర్యకాంతం చివరిదశ ఎంత దారుణంగా గడిచిందో తెలుసా…ఎంత మోసం చేశారో …?
Telugu Actress Suryakantham :సినిమాల్లో గడసరి అత్తగా, గయ్యాళి అత్తగా ముద్రవేసుకున్న సూర్యకాంతం తెలుగు ప్రజా హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరచుకుంది. అప్పట్లో ‘సూర్యకాంతం’ అనే పేరును పిల్లలకు పెట్టేందుకు తల్లిదండ్రులు వెనుకాడేవారట. సినిమాల్లో అలాంటి గయ్యాళి పాత్రలు వేసినా నిజ జీవితంలో మాత్రం ఆమె ఎంతటి మంచిదో సినిమా షూటింగ్స్ సమయంలో ఆమెతో పరిచయం గల ప్రతి ఒక్కరు చెప్పేమాట. ఓ సినిమాలో చిత్తూరు నాగయ్యను సన్నివేశాన్ని బట్టి సూర్యకాంతం నానాతిట్లూ తిట్టేసి, షాట్ అయ్యాక నాగయ్య కాళ్ళమీద పడి క్షమాపణలు అడిగారట.
అంతేకాదు సూర్యకాంతం షూటింగ్ లో పాల్గొన్న వారందరికీ భోజనాలు కూడా వండుకొని వచ్చేవారట. అయితే వెండితెరపై ఒక వెలుగు వెలిగి చివరి రోజుల్లో కష్టాలు అనుభవించారట. 1924, అక్టోబర్ 28న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయ పాలెం అనే గ్రామంలో సూర్యకాంతం జన్మించారు. హీరోయిన్ కావాల్సిన సూర్యకాంతం ఒక కారు ప్రమాదంలో మొహం మీద పడ్డ గాయాల వలన ఆమెకి వచ్చిన ఛాన్స్ పోయింది.
దాంతో సహాయ పాత్రలు, ముఖ్యంగా గయ్యాళి పాత్రలకే పరిమితమైంది.1953లో ‘కోడరికం’ చిత్రంతో గయ్యాళి పాత్రలకు ట్రేడ్ మార్క్‌గా సూర్యకాంతం నిలిచారు. హావభావాలతో గయ్యాళితనాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యేకత సాధించుకున్నారు. ఆ తరువాత చిరంజీవులు, వెలుగునీడలు, మాయాబజార్, దొంగరాముడు, తోడికోడళ్ళు, అత్తా ఒకింటి కోడలే, మాంగల్యబలం, ఇల్లరికం, భార్యాభర్తలు, గుండమ్మ కథ ఇలా పలు సినిమాల్లో సహజ నటనతో అలరించారు.
ఇక సూర్యకాంతం సినిమా రెమ్యునిరేషన్ విషయంలో నిక్కచ్చిగా ఉండేవారట. తన మొదటి సినిమాకే నా కష్టానికి సరిపడా డబ్బులు ఇవ్వట్లేదని అడిగిమరీ రెమ్యునిరేషన్ ఎక్కువ తీసుకుందంటే డబ్బు విషయంలో సూర్యకాంతం ఎంత మొండిఘటమో అర్ధం చేసుకోవచ్చు. ఇక అప్పట్లోనే తన అన్ని ఆర్ధిక లావాదేవీలు, వ్యాపారాలు తానే దగ్గరుండి చూసుకోనేవారట.
ఇక 1950 లో హైకోర్టు జడ్జీ పెద్దిభోట్ల చలపతి రావు ని వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. దాంతో సూర్యకాంతం చివరి రోజుల్లో తన ఆస్థి మొత్తం తన సోదరులు పేరున రాయమని కోరిందట. కానీ లాయర్ సూర్యకాంతంని మోసం చేసి ఆ ఆస్థి మొత్తాన్ని తన పేరుమీద మార్చేసు కున్నారట. ఈ విషయం సూర్యకాంతం మరణాంతరం వెలుగులోకి రావడంతో ఆమె సోదరుడు గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.

