మన్మధుడు హీరోయిన్ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుంది
Manmadhudu heroine anshu :జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ తొలిప్రయత్నంలో వీళ్ళ కాంబినేషన్ కి మంచి క్రేజ్ వచ్చింది. మళ్ళీ వీరిద్దరి కాంబోలో సినిమాకి సంబంధించి పనుల్లో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. ‘ఆర్ ఆర్ ఆర్’లో తన పోర్షన్ కి సంబంధించిన షూటింగు పూర్తికాగానే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టులో జాయిన్ అవుతాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అక్క పాత్రలో ‘అన్షూ’ నటించనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి.
కింగ్ నాగార్జున కథానాయకుడిగా 2002లో కె.విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘మన్మథుడు’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి కథా – మాటలు త్రివిక్రమ్ అందించాడు. అందులో హీరోయిన్ గా ‘అన్షూ’ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉంటుందని భావించారు. అయితే ఆమె ఒకటి రెండు సినిమాల్లో మెరిసి మాయమైంది.
అందగత్తెగా మార్కులు సంపాదించుకున్న ఈ బ్యూటీ మంచి క్రేజ్ ఉన్న సమయంలో ఇండస్ట్రీని వదిలేసి, పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. మళ్లీ ఇంతకాలానికి ‘అన్షూ’పేరు తెరమీదికి వచ్చింది. అయితే ముఖ్యమైన పాత్రల కోసం అప్పటి హీరోయిన్లను సెకండ్ ఇన్నింగ్స్ పేరిట తెస్తున్న త్రివిక్రమ్ ఈ అమ్మాయితో రీ ఎంట్రీ ఇప్పిస్తున్నాడనేది వైరలవుతోంది అయితే సినిమాలే వద్దనుకుని వెళ్ళిపోయినా ఆమె నిజంగా రీ ఎంట్రీ ఇస్తుందా అనేదే అనుమానమే.

