నిర్మలమ్మ మనవడు కూడా హీరోనే…ఎవరో చూడండి
Senior Actress Nirmalamma :ఇండస్ట్రీలో వారసత్వానికి కొదవలేదు. కొడుకు కాకపొతే మనవడు .. కూతురు కాకుంటే మనవరాలు .. ఇలా ఎవరో ఒకరు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు. ఇక నాటక రంగంలో ఓ వెలుగు వెలిగి సినిమా రంగంలో కూడా తనదైన ముద్ర వేసిన నిర్మలమ్మ వారసత్వం కూడా ఇండస్ట్రీలో ఉంది. అమ్మగా, బామ్మగా, అమ్మమ్మగా ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. నిర్మలమ్మ కామెడీ, ఎమోషన్, గయ్యాళి పాటలతోనే కాదు, సీతారామరాజు మూవీలో విలనిజంలో కూడా తన మార్క్ చూపించింది.2009ఫిబ్రవరి 19న ఈలోకం నుంచి నిష్క్రమించింది.
ఎన్టీఆర్, అక్కినేని, చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున, ఇలా ఎంతోమందికి అమ్మగా, అమ్మమ్మగా నటించి మెప్పించింది. వెయ్యి సినిమాలు చేసిన కొద్దిమంది నటుల్లో నిర్మలమ్మ ఒకరు. చిరంజీవి స్నేహం కోసం మూవీ తర్వాత నిర్మలమ్మ కన్పించలేదు. రియల్ లైఫ్ లో కూడా షూటింగ్ సమయంలో అందరి బాధలను తెలుసుకుని తల్లిలా ఆదరించేదని అక్కినేని కూడా ఒకప్పుడు చెప్పారు. ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణారావు ఈమెను చూసి, నేరుగా ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుంటానని అడిగాడు.
అయితే పెళ్లయ్యాక కూడా నటించడానికి ఒప్పుకుంటే ఒకే అనే షరతు విధించి మరీ నిర్మలమ్మ పెళ్లి చేసుకుంది. ఇక పిల్లలు లేకపోవడంతో డిప్రెషన్ కి గురైంది. మరోపక్క కృష్ణారావు కి ఛాన్స్ లు తగ్గాయి. అప్పులపాలు అయ్యారు. మళ్ళీ నాటకాల్లో వేస్తూ, 1961లో కృష్ణ ప్రేమ మూవీలో నటించడం ద్వారా సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక వెనుదిరిగి చూడలేదు. ఓ కూతురుని పెంచుకుని పెద్ద చేసి, పెళ్లి చేసింది. ఈమె మనవడు విజయ్ మాదాల గణపతి పాత్రతో పడమటి సంధ్యారాగం మూవీలో ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కువగా అమెరికాలో ఉండడం వలన తెలుగు రాలేదు. ఇక మనవడి పెళ్లి చూడాలనుకున్న నిర్మలమ్మ ఆశ తీరకుండానే వెళ్ళిపోయింది.

