MoviesTollywood news in telugu

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య అసూయ…అసలు విషయం ఇదే

Ashu Reddy and Himaja :స్టార్ మాలో ప్రసారమయిన బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 3 లో పాల్గొన్న కంటెస్టెంట్ లలో హిమజ, అషురెడ్డి హౌస్ లో ఉన్నప్పుడే కాకుండా బయట కూడా ఎంతో స్నేహంగా ఉంటారు. మిగతా కంటెస్టెంట్ లతో కలిసి వీళ్ళు చేసే అల్లర్లు మామూలుగా ఉండేది కాదు. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తారు. అయితే ఎంత స్నేహంగా ఉన్నా హిమజ, అషు రెడ్డి ల మధ్య ఓ వార్త వైరల్ గా మారింది. హిమజను చూసి అషు రెడ్డి తెగ అసూయ పడుతోందట.

ఎందుకంటే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో హిమజ ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమాలో హిమజ నటించడానికి సిద్ధం కాగా, పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో ను షేర్ చేస్తూ నటిస్తున్నాననే విషయాన్ని షేర్ చేసుకుంది. ఇక ఇది చూసిన అషు రెడ్డి తట్టుకోలేక.ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఎంతో జెలసీ గా ఉందంటూ కామెంట్ చేయడం వైరల్ గా మారింది. ఇలా అసూయ పడ్డానికి కారణం ఉంది. నిజానికి అషురెడ్డి కు పవన్ కళ్యాణ్ అంటే చెప్పలేనంత ఇష్టం.

అషురెడ్డి ప్రైవేట్ పార్టులో కూడా పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న టాటూలను వేసుకోవడమే ఆమె పిచ్చి అభిమానానికి నిదర్శనం. ఇక పవన్ తో కలిసి దిగిన ఫోటోలను కూడా తెగ షేర్ చేసింది. దాంతో హిమజ కు ఛాన్స్ రావడం ఎలా తట్టుకుంటుంది. కాగా అషు రెడ్డికి, రాహుల్ సిప్లిగంజ్ కు ఉన్న సంబంధం కొన్ని షోలలో ఆమె చేసే అల్లర్లు వైరల్ అవుతున్నాయి. పైగా సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ, ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను పంచుకుంటుంది.