MoviesTollywood news in telugu

శ్రీమంతుడు సీరియల్ నటి కావేరి రియల్ లైఫ్..భర్త స్టార్ హీరో

srimanthudu serial kaveri :సినిమాలకు ధీటుగా బుల్లితెరపై సీరియల్స్ కి విశేష ఆదరణ లభిస్తోంది. దాంతో కొత్త కొత్త సీరియల్స్ కూడా వస్తున్నాయి. అందులో భాగంగా ఈటీవీలో ఇటీవల శ్రీమంతుడు సీరియల్ స్టార్ట్ అయింది. మొదలైన కొద్దిరోజుల్లోనే ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టు కుంటోంది. ఇక ఇందులో నటిస్తున్న కావేరి తన అందంతో , అభినయంతో అలరిస్తోంది.

కేరళలోని తిరువనంతపురంలో సహేదా , ఇజా దంపతులకు 1991జూన్ 15న జన్మించిన కావేరి అసలు పేరు షఫ్న నిషా. ఈమెకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి ఉండడంతో మలయాళం ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టింది. తర్వాత కూడా నటన కొనసాగిస్తూ పాపులర్ యాక్ట్రెస్ గా ఎదిగింది.

కేవలం మాలయంలోనే కాకుండా తెలుగు, తమిళ మూవీస్ లో కూడా నటించిన షఫ్న తెలుగులో రజనీకాంత్, జగపతి బాబు నటించిన కథానాయకుడు మూవీలో నటించింది. మలయాళంలో కూడా సుందరి, సహాయాత్రిక, ప్రియంకరీ వంటి పలు సీరియల్స్ కూడా నటించింది. బెస్ట్ యాక్ట్రెస్ గా కేరళ టెలివిజన్ అవార్డు కూడా అందుకుంది. ఈమె భర్త షాజీ కూడా ఫేమస్ యాక్టర్ కావటం విశేషం.