కృష్ణ తులసి నటి రూపారాణి రియల్ లైఫ్…అసలు నమ్మలేరు
Krishna tulasi serial actress rupa rani(aadhya)real life :జి తెలుగులో ఇటీవల ప్రారంభమైన కృష్ణ తులసి సీరియల్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇందులోని నటీనటులు తమ నటనతో ఆడియన్స్ ని అలరిస్తూ, బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న రూపారాణి తన నటనత మంచి హావభావాలు ప్రదర్శిస్తూ,తక్కువ సమయంలోనే ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. మంచి పాపులార్టీ తెచ్చుకుంటోంది.
తెలుగు అమ్మాయి అయిన రూపారాణి అసలు పేరు ఆద్య పరుచూరి. చిన్ననాటి నుంచి నటన మీద, మ్యూజిక్ మీద మక్కువతో నటి కావాలని ఎన్నో డ్రీమ్స్ ఉండేవి. తన కోరిక కు అనుగుణంగా కృష్ణ తులసి సీరియల్ తో తొలిసారి బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కృష్ణ తులసి లార్డ్ కృష్ణ, మ్యూజిక్ అంశాలకు సంబంధించింది.
నిజానికి ఆద్య నిత్యం ఆరాధించి కొలిచే దేవుడు కృష్ణుడు కావడం, తనకు మ్యూజిక్ అంటే ఇష్టం ఉండడం ఈ రెండు అంశాలు ఈ సీరియల్ ద్వారా ఆద్య కు బాగా కల్సి వచ్చాయి. మరీ ముఖ్యంగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వస్తున్న సీరియల్ కావడం మరీ ఆనందంగా ఉందని ఆద్య అంటోంది.

