MoviesTollywood news in telugu

అనీ మాస్టర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

Choreographer anee master :సినిమా అన్నాక హీరోకి ఫైట్లు, పాటలు తప్పనిసరి. హీరో, హీరోయిన్స్ డ్యూయెట్ సాంగ్స్ స్టెప్పులే ప్రధానం. దాంతో ఒకప్పుడు అంతగా ప్రాధాన్యత లేని డాన్స్ మాస్టర్లకు ఇప్పుడు మంచి గిరాకీ వచ్చింది. కొరియోగ్రాఫర్స్ గా మంచి పేరొస్తోంది. ఒకప్పుడు డాన్స్ మాస్టర్ సలీం , శ్రీను ఆతర్వాత ఒకప్పుడు సుందరం మాస్టర్, ప్రభుదేవా, లారెన్స్ లాంటి కొరియోగ్రాఫర్లు గా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఇక ఇప్పుడు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, రఘు మాస్టర్ లాంటి వాళ్ళు ఏలుతున్నారు.

అయితే సుచిత్ర లాంటి మహిళా కొరియోగ్రాఫర్స్ కూడా తమదైన ముద్ర వేశారు. ఇక ప్రస్తుతం సినిమాల్లో కొరియోగ్రఫీ చేస్తూనే డీ షో లో జడ్జిగా వ్యవహరిస్తూ జనాలందరికీ దగ్గరైన అనీ మాస్టర్ ముప్పై సినిమాల దాకా కొరియోగ్రాఫర్ గా చేసింది. ప్రభు అనే వ్యక్తిని ఈమె ప్రేమించి పెళ్లి చేసుకోగా, వీళ్ళకి ఒక బాబు ఉన్నాడు. జీవితంలోకి వెళ్తే విషాదం తొంగిచూస్తోంది.

ఇండస్ట్రీలో చాలా మందికి కొరియోగ్రఫీ చేసి వాళ్లతో తన స్టెప్పులు వేయించిన అనీ మాస్టర్ పూర్తి పేరు లామా అనిత. ఈమె డార్జిలింగ్ లో పుట్టిన ఈమెకు ఐదేళ్ల వయస్సు లోనే వాళ్ళ నాన్న మరణించడంతో వాళ్ల అమ్మతో పాటు హైదరాబాద్ కి వచ్చేసింది. టెన్త్ వరకు చదివిన ఆమె ఆ తర్వాత చదువు ఆపేసి కుటుంబాన్ని పోషించడానికి స్టేజ్ షోలు ఇస్తూ, వీలైనప్పుడల్లా డాన్స్ ప్రాక్టీస్ చేసేది.

అలాగే అప్పుడప్పుడు సినిమా ఆడియో ఫంక్షన్ లో డాన్స్ చేసే డాన్సర్ల కి కొరియోగ్రఫీ చేస్తూ ఉండేది. సరిగ్గా అదేసమయంలో మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎం బి బి ఎస్ సినిమా కి తనని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేయమని ఒక ఫోన్ పిలవడంతో చిరంజీవి ఇంటికి వెళ్లి కలిసి, ఆ సినిమాలో ‘నా పేరే కాంచనమాల’ అనే సాంగ్ కి హరీష్ పాయ్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేసింది.

ఆ తర్వాత చాలా సినిమాలకు చాలా మంది దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసిన అనీ టాలెంట్ గుర్తించిన పూరి జగన్నాథ్ ఛార్మి తో తీసిన జ్యోతిలక్ష్మి సినిమా లో కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చాడు. తను నేర్పించిన డాన్స్ కి మంచి గుర్తింపు వచ్చినప్పటికీ తర్వాత పెద్దగా ఛాన్స్ లు దక్కలేదు. అనుకోకుండా గుడుంబా శంకర్ లాంటి సినిమాకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేయడంతో పవన్ కళ్యాణ్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పడి, సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతున్న ప్లేస్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ కి తన జ్యోతిలక్ష్మి లో చేసిన సాంగు చూపించింది.

పవన్ కళ్యాణ్ కి ఆ సాంగ్ నచ్చడంతో సర్దార్ గబ్బర్ సింగ్ లో ఒక సాంగ్ కొరియోగ్రాఫర్ చేసే ఛాన్స్ ఇవ్వడం, ఆ సాంగ్ కి ,ఆమెకు మంచి గుర్తింపు రావడంతో ఇక వెనుదిరిగి చూడలేదు. లోఫర్, రోగ్, పైసా వసూల్, మహానటి, కళ్యాణ వైభోగం ఇలా వరుస సినిమాలకి కొరియోగ్రాఫర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.