సావిత్రమ్మ గారబ్బాయి సీరియల్ హీరో కి పెళ్లి…టాప్ హీరోయిన్…?
Savitramma Gari Abbayi Serial Hero Balaraju :సావిత్రమ్మ గారబ్బాయి సీరియల్ మన తెలుగు బుల్లితెర ఆడియన్స్ ని బాగానే అలరిస్తోంది. ఇందులో హీరోగా చేస్తున్న బాలరాజు తన నటనతో, అందంతో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఇతడి పూర్తిపేరు చందన్ కుమార్. అయితే ఈ సీరియల్ నుంచి తప్పుకున్నాడు.
దీంతో చందన్ కుమార్ ని మిస్సవుతున్నామని ఫాన్స్ అందరూ అంటున్నారు. అయితే త్వరలో పెళ్లి చేసుకోడానికి యితడు రెడీ అవుతున్నాడని టాక్. సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే భార్యను పరిచయం చేసాడు. ఆమె పేరు కవిత. ఆమె కూడా సీరియల్స్ లో నటిస్తోంది. ఎన్నో కన్నడ సీరియల్స్, సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
కన్నడ బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్న కవిత తో కల్సి కన్నడ సీరియల్ లో చందన కుమార్ నటించాడు. ఆసమయంలోనే వీరిద్దరికి మంచి పేరు రావడం, ఇద్దరూ ప్రేమించుకోవడం జరిగాయి. ఇద్దరూ ఇప్పుడు పెళ్లిపీట లెక్కుతుండడం పట్ల ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చందన కుమార్ పలు కన్నడ సీరియల్స్ లో, సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. వీరికి ఎంగేజ్ మెంట్ కూడా చాలా వైభవంగా జరిగింది.