మహేష్-జక్కన్న కాంబోలో సినిమా స్టోరీ ఇదేనట…?
Mahesh babu and rajamouli movie :సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా అనగానే ఫాన్స్ లో యమ క్రేజ్ ఉంటుంది. వీరిద్దరికీ గల క్రేజ్,ఇద్దరి కాంబోలో తొలి సినిమా కావడంతో మహేష్ తో జక్కన్న ఎలాంటి మూవీ తీస్తాడో అని ప్రేక్షకుల్లో కూడా ఇప్పటి నుండే ఆసక్తి మొదలైంది. అందుకే వీరిద్దరి సినిమా గురించి ప్రకటన వచ్చిన దగ్గర నుంచి పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కథపై కూడా ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి.
మహేష్ కోసం రాజమౌళి మరోసారి పీరియాడిక్ కథనే ఎంచుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్. ఇంకా చెప్పాలంటే, ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ తీద్దామనుకుని ఆగిపోయిన ఛత్రపతి శివాజీ సినిమానే ఇప్పుడు మహేష్ బాబుతో జక్కన్న తీస్తాడని జోరుగా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి రామ్ చరణ్,ఎన్టీఆర్ లతో చేస్తున్న‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.ఇది విడుదల అయ్యాక రాజమౌళి మహేష్ సినిమా గురించి ఆలోచన చేస్తాడు. మరోపక్క మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నాడు.
పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి గురించి చూపించనున్నట్లు టాక్. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. 2022 సంక్రాంతికి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత జక్కన్నతో ఉంటుందా, లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ముందుగా చేస్తాడా అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి మహేష్,రాజమౌళి సినిమా గురించి జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

