MoviesTollywood news in telugu

బిగ్ బాస్ సీజన్ 5 షాకింగ్ అప్ డేట్…ఎప్పుడో తెలుసా?

Telugu Bigg Boss 5 :ఎన్ని వివాదాలున్నా, ఎన్ని విమర్శలున్నా సరే, తెలుగు బుల్లితెర రియాల్టీ షోస్ లో అగ్రగామిగా పేరొందిన బిగ్ బాస్ ఇప్పటికే 4సీజన్స్ పూర్తిచేసుకుంది. దీంతో బిగ్ బాస్ సీజన్ 5 ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దానిపై ఎన్నో వార్తలు ఇప్పటికే తెగ వైరల్ అయ్యాయి. వచ్చే జూన్/ జులైలో బిగ్ బాస్ షో ప్రారంభించాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావించారు. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ పూర్తైందని తెలుస్తోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండడం వలన సీన్ రివర్స్ అయింది.

అయితే ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకుల అంచనాను బట్టి ఆగష్టు నెలలో ఈ షో ప్రారంభం కానుందని టాక్. మరీ ముఖ్యంగా గత ఏడాది కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రేక్షకుల అంచనాలను మించి బిగ్ బాస్ సీజన్ 4 వినోదం పంచిందన్న పేరు వచ్చింది. నిజానికి 4వ సీజన్ లో పరిచయం లేని కంటెస్టెంట్లు ఉన్నారు. పైగా షో రొటీన్ గా ఉందని విమర్శలు వచ్చినప్పటికీ కింగ్ నాగార్జున హోస్ట్ గా సీజన్ 4 సక్సెస్ చేసాడు.

కంటెస్టెంట్స్ ని క్వారంటైన్ లో ఉంచి మరీ షో కండక్ట్ చేసారు. అలాగే సీజన్ 5లో కూడా కంటెస్టెంట్లను క్వారంటైన్ లో ఉంచనున్నారని టాక్. ఇక సీజన్ 5కు కూడా నాగార్జునే హోస్ట్ గా చేయబోతున్నాడు. ఇక సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాకు సంబంధించి కొంతమంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తుండగా తుది జాబితాలో ఎలా ఉంటుందో చెప్పలేమని అంటున్నారు. ఆగష్టు నాటికి కరోనా తగ్గి సాధారణ పరిస్థితులు వస్తాయని బిగ్ బాస్ నిర్వాహకుల అంచనా.